Vasamsetty Subhash On Perni Nani: అచ్చేసిన అబోతుల ఉన్నావ్, ఇంత వయసు వచ్చిన నీకు బుద్ధి రాలేదని.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్..  వైసీపీ నేత  పేర్ని నానిపై మండిపడ్డారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు మీడియా సమావేశం నిర్వహించారు.  మంత్రి సుభాష్ పేర్ని నాని వైసీపీ నాయకుల పై ఫైర్ అయ్యారు. వైసిపి కార్యక్రమంలో పేర్ని నాని మంత్రి లోకేష్ ను సంబోధించిన తీరును మంత్రి సుభాష్ తప్పుపట్టారు

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా నరికేస్తానని చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన పేర్నినానిని ఊరుకునేది లేదన్నారు. అసభ్య పదజాలంతో హింసను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోబోమని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   "పేర్ని నాని రాబిస్ వచ్చిన కుక్కలాంటివాడు" అని వ్యాఖ్యానించారు.   నారా లోకేష్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో  సుభాష్ ఈ కౌంటర్ ఇచ్చారు. "ఇంత వయసు వచ్చినా పేర్ని నానికి బుద్ధి రాలేదు, అచ్చోసిన ఆంబోతులా ఉన్నావు" అని సుభాష్ ఘాటుగా స్పందించారు.  కొడాలి నాని గుడివాడలో చేసిన రాజకీయ కార్యకలాపాలు,  వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన ఆరోపణలపై సుభాష్ విమర్శలు చేశారు. "కొడాలి నానిని బనియన్, అండర్‌వేర్‌తో నిలబెట్టే రోజు త్వరలో వస్తుంది" అని సుభాష్ సవాల్ విసిరారు.  మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రిని తల్లిని చెల్లిని చిన్నాన్న వాడుకుని ఒక్క ఛాన్స్ అంటూ రాజకీయాలకు వచ్చాడని అన్నారు.  ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఒక్క ఛాన్స్ తో ఇంటికి పంపించారని అన్నారు. సంక్షేమం అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ వాళ్లు మోసం,  గ్యారంటీ అంటూ పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారని  మండిపడ్డారు.  

టిడిపి కార్యకర్తలు కొడాలి నాని కి చీరలు జాకెట్లు ఇస్తామని అన్నారని.. కానీ  అటువంటి ప్రస్తావన  తీసుకురావొద్దని చెప్పారన్నారు.   చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు హిందూ సాంప్రదాయం ప్రకారం చీరకు జాకెట్ కు అత్యంత విలువిస్తారని గుర్తు చేశారు.  మనం ఉన్న విలువను తీసినట్టు వద్దు కొడాలి నాని కీ అండర్ వేరు బనియన్ కరెక్ట్ అన్నారు. ఎప్పటికైనా కొడాలి నానిని బనీను డ్రాయర్లతో నిలబెట్టే రోజు వస్తుందని అన్నారు.