Army Jawan family meets chandrababu to complaint againt loss his home during YS Jagan rule


అమరావతి: తాము గత వైసీపీ ప్రభుత్వ బాధితులం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వద్ద జవాన్‌ దంపతులు కంటతడి పెట్టడం సంచలనంగా మారింది. తమ ఇంటికి బిల్డింగ్‌ ప్లాన్‌ నిర్ధారణ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, జగన్ ప్రభుత్వం ధ్రువపత్రం ఇవ్వకుండా వేదింపులకు గురిచేసిందని జవాన్ కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వేధింపుల కారణంగా తమ ఇల్లు కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.  


బార్డర్‌లో పాక్ సైన్యంతో పోరాడాను, కానీ


దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సరిహద్దుల్లో పాకిస్తాన్ తో సైతం యుద్ధం చేశాను, కానీ సొంత ప్రాంతంలో మాత్రం అవమానాలకు గురయ్యారనంటూ మాజీ జవాన్ జ్ఞానానంద్ కన్నీటి పర్యంతమయ్యారు.  దేశం కోసం కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నా, కనీసం తనను గుర్తించకుండా గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. తన సమస్యను పరిష్కరించి, తన ఇంటిని తనకు ఇప్పించాలని సీఎం చంద్రబాబు వద్ద  జవాన్‌ జ్ఞానానంద్‌, ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్య విన్న చంద్రబాబు తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని జవాన్ దంపతులు తెలిపారు.


జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు అని కన్నీళ్లు


ఆర్మీలో చేరి, కుటుంబాన్ని వదిలేసి సరిహద్దులో శత్రువులతో తన భర్త పోరాడారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ డబ్బుతో కట్టుకున్న ఇల్లును జగన్ హయాంలో కబ్జా చేశారు, ఇప్పుడు తమకు ఉండటానికి నిలువు నీడ లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన జీవితాంతం చేసిన కష్టంతో కట్టుకున్న ఇల్లు పోవడంతో తాము సర్వస్వం కోల్పోయామని జవాన్ భార్య మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.



జలగల్లా వేధించారని మాజీ జవాన్ ఆవేదన


 


జవాన్ జ్ఞానానంద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాం. ప్లాన్ కు సంబంధించి తనకు పూర్తి వివరాలు తెలియదన్నారు. అందుకే సంబంధిత పత్రాలే తీసుకోలేదని తెలిపారు. ఆ పేపర్లు తమతో ఉంటే సులువుగా బ్యాంక్ లోన్ ఇచ్చేదన్నారు. దాంతో బయట వడ్డీలు తెచ్చి, వాటిని కడుతూ ఎన్నో ఇబ్బందులు పడ్డానని మాజీ జవాన్ వెల్లడించారు. జగన్ హయాంలో తనను జలగల్లా వేధించుకు తిన్నారని, దాంతో తనకు పక్షవాతం సైతం వచ్చిందని తెలిపారు.


తన ఇంట్లో ఉంటున్న వెంకట కృష్ణ, అప్పారావులు అంజలితో పదే పదే ఫోన్ చేపించి మెంటల్ టార్చర్ చేశారని జవాన్ తెలిపారు. వెంకట కృష్ణ అనే వ్యక్తి సొంత సోదరికే అన్యాయం చేశాడు, కేసుల్లో ఇరుక్కున్నారని జవాన్ వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్, పెరాలిసిస్ వచ్చిందని నన్ను ప్రశాంతంగా ఉంచాలని, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావొద్దని డాక్టర్లు నా భార్యకు చెప్పడంతో ఆమె నరకం అనుభవించిందని.. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెల్లినట్లు వివరించారు. తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం ఉందన్నారు.



Also Read: AP Elections: జమిలి అమల్లోకి వచ్చినా, 2029లోనే ఏపీలో ఎన్నికలు - ఏపీ సీఎం చంద్రబాబు