APSRTC Special Package: ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. తిరుమలకు వెల్లే ప్రయాణికులకు బస్సుల్లోనే శ్రీవారి శీఘ్ర దర్శనం టిక్కెట్లు ఇస్తున్న విధానాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా విస్తరించింది. ఇకపై శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ తరహా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 9వ తేదీ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లికార్జున స్వామి భ్రమిరాంబిక అమ్మవార్ల స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ప్రతిరోజూ 1075 దర్శన టికెట్లు కేటాయించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్లతో పాటు దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు వివరించారు. 

Continues below advertisement






ప్రయాణానికి 15 రోజుల ముందుగానే దర్శనం టికెట్లు జారీ చేస్తామని చెప్పారు ఏపీఎశ్ ఆర్టీసీ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వివరించారు. దేవాదాయ శాఖ సమన్వయంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.