Dastagiri Comments :   వైఎస్ వివేకానందరెడ్డి కేసులో  అప్రూవర్‌గామారిన మాజీ డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణభయం ఉందని ఆందోళన చెందుతున్నారు. తన కుక్కను చంపేశారని.. తన గన్‌మెన్లను హఠాత్తుగా మార్చారని ఆందోళన చెందిన ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎస్పీ దస్తగిరి ఫిర్యాదును తేలికగా తీసుకున్నారు. దీనిపై దస్తగిరి ఆందోళన ్యక్తం చేశారు. తాను ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్పీ ఇచ్చిన  మీడియా స్టేట్ మెంట్ లో తన ఆందోళన అంతా అవాస్తవమని కొట్టి పారేయడం బాధాకారమన్నారు. తన ఇబ్బందులు తనకే తెలుసుని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు.  నా కుక్క చనిపోవడం, గన్మెన్లను మార్చడం..లాంటి ఘటనలు జరగడంతో  మీడియాకు తెలిపానన్నారు. 


తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని దస్తగిరి ఆందోళన


గతంలో లాంటి ఘటనలు జరిగిన తర్వాతే టార్గెట్‌ ను చంపిన ఘటనలు ఉండటంతో దస్తగిరి మరింత ఆందోళన చెందుతున్నారు. తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యతని దస్తగిరి స్పష్టం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వైఎస్ కుటుంబీకులు అంత ఒక్కటేనన్నారు. ప్రభుత్వం కూడా వారి చేతుల్లోనే ఉంది కాబట్టి.. కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. పెద్ద పెద్ద వాళ్లనే కీలు బొమ్మలు చేసి ఆడుకుంటున్నారని.. తనను ఏమైనా చేయగలరని దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. నాకు ఎదైనా హని జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని దస్తగిరి స్పష్టం చేశారు. 


గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వస్తున్నారన్న  దస్తగిరి 


తన ఇంట్లో 2వ తేదీన కుక్క చనిపోతే 6వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఆరుగురు వచ్చి కుక్కను కొంటామన్నారని, అయితే ఇందులో ఏదో కుట్ర దాగివుందనే అనుమానాన్ని దస్తగిరి వ్యక్తం చేస్తున్నారు. కుక్క చనిపోవడం, ఆ తర్వాత కుక్కను కొంటామంటూ రావడం.. వారు కూడా తాను ఇంటివద్ద లేని సమయంలో రావడంలాంటివి చూస్తే కచ్చితంగా అనుమానం కలుగుతోందని దస్తగిరి రెండు రోజుల కిందట ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పోలీసులు   గన్ మెన్లను మార్చారు.  సీబీఐ అధికారులకు దస్తగిరి  ఒక లేఖ రూపంలో అధికారులకు అందజేశారు. వారి సూచనలతో ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఎస్పీ అన్నీ అబద్దాలేనని చెప్పడంపై ఆవేదన 


అయితే పోలీసులు దస్తగిరి చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేల్చేయడంతో ఆయన మరింత ఆందోళన చెందుతున్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని అంటున్నారు. తనకేమైనా జరిగితే ఖచ్చితంగా సీఎన్ జగనే బాధ్యత వహించాలని చెబుతున్నారు.  వివేకానందరెడ్డి దర్యాప్తు విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని.. పోలీసుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉందన్న ఆరోపణలు కొంత కాలంగా వస్తున్నాయి.   సీబీఐ విచారణాధికారి రాంసింగ్ పైనా పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసును క్వాష్ చేయాలని సీబీఐ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. 


విశాఖ వైఎస్ఆర్సీపీలో "భూ లకటక " - రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల మధ్య రాజకీయంలో నలిగిపోతున్న అధికార పార్టీ !