జనసేన అధినేత పవన్ కల్యాణ్ నర్సాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభ నిర్వహించి జీవో నెం. 217 చించి వేసిన అంశం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.  జీవో 217పై దుష్ప్రచారం చేస్తున్నారని మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. జీవో 217 మత్స్యకారు హక్కులకు ఎలాంటి  భంగం కలిగించబోదని స్పష్టం చేశారు. ఆ జీవో కేవలం  100 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు మాత్రమే వర్తిస్తుందని చిన్న చెరువులకు వర్తించదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఉందని.. వీటిలో న్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్నవి కేవలం 582 చెరువులేనన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వాటికే వర్తిస్తుందని స్పష్టం చేశారు. 


రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్


నెల్లూరులోని 27 చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ జీవో అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.  నెల్లూరులో విజయవంతమైతే మిగతా చోట్లకు విస్తరించాలని నిర్ణయించామని మత్స్యశాఖ కమిషనర్ తెలిపారు. ఈ జీవో వల్ల మత్స్యకార సంఘాలకు మరింత ఆదాయం పెరుగుతుందన్నారు.  దళారుల దందాపై అధ్యయనం చేసి ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. జీవో నెంబర్ 217 ప్రకారం ఇప్పటి వరకూ మత్స్యకార సొసైటీలకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించేవారు.  కానీ ఈ జీవో ద్వారా బహిరంగ వేలానికి వెళ్లాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి   27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లారు.   తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయి. వందల  ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో లేకుండా జీవో ద్వారా తొలగించారు వాటిపై వస్తున్న ఆదాయం దళారుల పాలవుతోందని అందుకే ఈ నిరణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.  


పులివెందుల నుంచి కడపకు మార్పు - ఇక వివేకా కేసు తేలేది అక్కడే !


మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం  అనేక పనులు చేపట్టామని చెబుతోంది. 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయి. రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయించామని ని కన్నబాబు చెప్పారు. రూ.3,177 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని.. ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. ప్రస్తుతం 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయని.. మిగతా 5 ఫిషింగ్ హార్బర్లూ టెండర్ల దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మత్స్య ఎగుమతులను దేశీయంగా మరింత పెంచేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. రీటైల్ అవుట్‌లెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని.. రోడ్డు పక్కన అమ్ముకునే వారికి సౌలభ్యం కలిగించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. జీవో 217 వల్ల మత్స్యకారులకు లాభమే తప్ప నష్టం లేదన్నారు.