Breaking News Live Telugu Updates: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, తల్లీ కుమారుడు దుర్మరణం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 23 Jan 2023 02:24 PM

Background

చైనా రీ ఓపెనింగ్‌ తర్వాత ఆ దేశంలో కార్యకలాపాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో ర్యాలీ కొనసాగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.05 డాలర్లు పెరిగి 87.66 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌...More

AP Employees Union: ఏపీ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. వారం ోజుల్లో వివరణ ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గవర్నర్ ను కలిసి సమస్యలను విన్నవించిన సంగతి తెలిసిందే. ఇది రోసా నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం చెప్పింది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా గవర్నర్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించింది.