Mukesh Ambani Visits Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కాబోయే కోడలు రాధికతో కలసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు.
దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ముకేశ్ అంబానీకి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలో మీడియాతో అంబానీ మాట్లాడారు.
భారీ విరాళం
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు అంబానీ. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఆ సమయంలో అంబానీతో పాటు ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాల్గొన్నారు.
గోశాలకు
అనంతరం శ్రీవారి ఆలయం నుంచి అంబానీ గోశాలకు వెళ్లారు. అక్కడ ఉన్న మహాలక్ష్మి ఏనుగుకు పళ్ళు అందించారు. మహాలక్ష్మి వద్ద ముకేశ్ అంబానీ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు నుంచి శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. అల్పాహారం స్వీకరించిన తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ప్రత్యేక చార్టెడ్ విమానంలో ముంబయికి తిరుగు ప్రయాణం కానున్నారు.
రద్దీగా
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీ వేంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం 16-0 9-22 రోజున 65,634 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 31,419 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 4 కోట్లు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.
ఇక సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట ఎస్ఎంసీ జనరేటర్ వరకూ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.
Also Read: AP Assembly Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, ఆయనకే ఛాన్స్ !
Also Read: Chandrababu: టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తా - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు