Andhra News :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు లేటు చేస్తోంది కానీ.. నెలల తరబడి ఇవ్వకుండా ఉంటోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేషీలో మాత్రం ఉద్యోగులకు గత జనవరి నుంచి జీతాలు అందడం లేదు. దాంతో వారు పేషీకి తాళం వేసుకుని ఊరెళ్లిపోయారు. సచివాలయంలో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ   పేషీలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిలో అటెండర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి కాపు కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్లు నుంచి జీతాలు అందేలా ఏర్పాటు చేశారు. 


ఏడు నెలల నుంచి జీతాలు రావడం లేదన్న సిబ్బంది                          


అయితే పేషీలో సిబ్బందికి 2022 డిసెంబర్ నుంచి జీతాలు రావడంలేదు.  మంత్రికి, అధికారులకు జీతాలపై చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.  దీంతో గత ఏడు నెలలుగా జీతాలు రాక సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇలాగే ఉంటే జీతాలు ఎగ్గొడతారన్న  అనుమనంతో..  ఉద్యోగులు సహాయనిరాకరణకు దిగారు. తమ జీతాల విషయంలో అనేక మార్లు ఓఎస్డీ, మంత్రిని అడిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని.. వారు   చాంబర్ కూడా ఓపెన్ చేయకుండా తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. సోమవారం చాంబర్ తెరవలేదు. విషయమేమిటా అని అక్కడి ఉద్యోగులు ఆరా తీస్తే.. ఊరెళ్లామని.. దారి ఖర్చులకూ డబ్బుల్లేక రాలేకపోతున్నామని..జీతాలివ్వలేదని సమాధానం చెబుతున్నారు. 


బీజేపీ అగ్రనేతల విమర్శలపై జగన్ మౌనం - వారి ఆరోపణలను అగీకరిస్తున్నట్లేనా ?


వారంతా మంత్రి నియమించుకున్న వారే !                                                          


మంత్రి పేషీలో పని చేసే వారంతా.. మంత్రికి బాగా సన్నిహితులే అయి ఉంటారు. పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా ఇతరుల్ని మంత్రి కాంట్రాక్ట్ పద్దతిలో నియమించుకుంటారు. వీరు అలా నియమితులైన వాళ్లేనని తెలుస్తోంది. అయితే మంత్రి నియమించినప్పటికీ వారికి జీతాలు రాకపోవడంతో  ఇబ్బంది పడుతున్నారు. వారిని కాంట్రాక్ట్ ఉద్యోగుల కిందఇతర కార్పొరేషన్ల ఖాతాలో నియమించుకుని వారి సేవల్ని మంత్రి పేషిలో వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏడు నెలలుగా జీతాలివ్వకపోవడాన్ని మంత్రి కూడా పరిష్కరించలేకపోవడంతో  సిబ్బంది తాళాలేసి ఊరికి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. 


టీడీపీ దుకాణం మూసేయడానికి సిద్ధంగా ఉంది- వాగ్దానాలు, మోసమే చంద్రబాబు సైకిల్‌: జగన్


జీతాలివ్వడం లేదని ఇటీవలే ముగ్గురు ఆత్మహత్యాయత్నం                                


ఏపీలో కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలకు ఇలాగే ఇబ్బంది పడుతున్నారని తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట స్కిల్ డెలవప్ మెంట్ శాఖలో జీతాలు ఇవ్వలేదని ముగ్గురు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేయడం కూడా సంచలనం సృష్టించిది. ఇలాంటివి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని తెలిసినా సమయానికి జీతాలివ్వడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.