దివ్య అలిసిపోయి పడుకుంటే విక్రమ్ వచ్చి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. మీ అమ్మని వెళ్ళి మొదటి రాత్రి ముహూర్తం గురించి అడిగే ధైర్యం లేదని దివ్య అంటుంది. అమ్మ భజన మొదలు పెడతాడు. మరి నేను చెప్పేది వినవా? కంటితో చూసినవి నిజం అవాల్సిన అవసరం లేదు. మనసుతో చూడు చుట్టు ఏం జరుగుతుందో తెలుస్తుందని దివ్య చెప్తుంది. ఎవరి గురించి చెప్తున్నావని అడుగుతాడు. నన్ను ఇలా అడగటం మానేసి ఆలోచించిన రోజు తన మాటలు అర్థం అవుతాయని అంటుంది. నీరసంగా ఉన్నావాని సూప్ చేశానని చెప్పి ప్రేమగా తాగిస్తాడు. అది చూసి రాజ్యలక్ష్మి రగిలిపోతుంది. నందుని నిర్దోషిగా తులసి ఇంటికి తీసుకొస్తుంది. వెంటనే అనసూయ నందుకి దిష్టి తీస్తుంటే లాస్య పక్కకి వచ్చి నిలబడుతుంది. ఇద్దరం కలిసి ఒకేసారి ఇంట్లోకి అడుగుపెడదాం ఒకరకంగా కొత్త కాపురం కదా అని ఓవర్ యాక్షన్ చేస్తుంది.


Also Read: ముకుందకి థాంక్స్ చెప్పిన రేవతి- ఇంకెన్నాళ్ళు ఈ మురారీ, కృష్ణ ప్రేమ ఊగిసలాట


లాస్య ఇంట్లోకి రావడంతో అనసూయ తిడుతుంది. మా అందరి ముందు దీన్ని మెడ పట్టి బయటకి గెంటేయని చెప్తుంది. మీ అబ్బాయి పిలిస్తే రాలేదు వెళ్ళి మొగుడితో కాపురం చేసుకోమని కోర్టు ఆర్డర్ వేస్తే వచ్చానని లాస్య అంటుంది. కోర్టు మాట తనేందుకు వినాలని అనసూయ అరుస్తుంది. నువ్వు ఈ ఇంట్లోకి అయితే రాగలవు కానీ మనసులోకి మాత్రం రాలేవని నందు అంటాడు. కోర్టు ఇచ్చిన 30 రోజుల గడువులో నీతోనే మనం కలిసి ఉందామని అనిపిస్తానని లాస్య చెప్పేసి వెళ్ళిపోతుంది. డివోర్స్ కో కోర్టు ఒప్పుకోలేదని నెలరోజులు కలిసి ఉండాలని అప్పటికి మనసులు కలవకపోతే అప్పుడు విడాకులు తీసుకోవచ్చని జడ్జి చెప్పిన విషయం నందు చెప్పేసరికి పరంధామయ్య బాధపడతాడు. బసవయ్య నెత్తి మీద కర్చీఫ్ వేసుకుని అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని పాట పెట్టుకుని కూర్చుంటాడు. రాజ్యలక్ష్మి వచ్చి ఏంటి ఇదనీ రగిలిపోతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదని మనం అనుకుంటే ఇలా జరిగింది, వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడే ఆడించింది. ఇప్పుడు ఆ బాహుబలి బయటకి వచ్చాడు. కూతురి కంట్లో కన్నీళ్ళు వస్తే చేర్నాకోలు పట్టుకుని వచ్చేస్తాడని భయపెడతాడు.


Also Read: ఒకరికొకరు ఎదురుపడిన రిషిధార- మహేంద్రకి ఫోన్ చేసిన వసు, కొడుకు ఆచూకీ తెలుసుకోగలుగుతాడా?


నందు సంగతి లాస్య చూసుకుంటుందని రాజ్యలక్ష్మి అంటుంది. దివ్యతో పుట్టింటి సంబంధాలు తెంచుకుంటే బాగుంటుందని ప్రసన్న సలహా ఇస్తుంది. అనసూయ నందుకి వడ్డిస్తుంటే లాస్య మధ్యలో దూరి కోర్టు ఆర్డర్ అని గుర్తు చేస్తుంది. తను చెప్పిన మాట వినకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుందని లాస్య బెదిరించే సరికి అందరూ భయపడిపోతారు. మరి అదేం విచిత్రమో. ఈ నెల రోజులు నా భర్తకి నేను దగ్గర అవాలి ఎవరు మధ్యలోకి రావొద్దని అంటుంది. అదే అంతే అంటుంది తినమని అంటే నందు తినే ప్లేట్ ని లాగేస్తుంది. ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందోనని తులసి టెన్షన్ పడుతుంది.