Ambati Rambabu Son in Law Video: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన ఇంటి మనిషే అంబటిని ఛీత్కరించుకుంటున్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ఎన్నికల వేళ మంత్రి అంబటి రాంబాబు చిన్న అల్లుడు డాక్టర్ గౌతమ్ ఈ వీడియోను విడుదల చేశారు. అంబటి రాంబాబు గురించి ఆయన చిన్న అల్లుడు డాక్టర్ గౌతమ్ మాట్లాడిన వీడియో సంచలనంగా మారింది. ఇందులో అసలు అంబటి రాంబాబు మనిషే కాదని, శవాల పేలాలు ఏరుకునే రకం అంటూ ఆయన అల్లుడు ఆరోపించారు.
‘‘నాపేరు డాక్టర్ గౌతమ్. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన అంబటి రాంబాబు అల్లుడ్ని. అది నా దురదృష్టకరం. దానికి ఎవరూ ఏం చేయలేదు. ఈ వీడియో చేయాలా వద్దా అని నేను బాగా ఆలోచించి.. చేయడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నా జీవితంలో చూడలేదు. రోజూ దేవుడికి దండం పెట్టుకొనేటప్పుడు ఇంతటి నీచుడ్ని ఇంకోసారి నా జీవితంలో ఇంట్రడ్యూస్ చేయకుస్వామి అని మొక్కుకుంటాను. అంత భయంకరమైన వ్యక్తి అంబటి. ఏ పోస్ట్ కు అయితే.. ఆయన పోటీ చేయబోయే పోస్టుకు మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో.. ఆయనలో అవి లేవు. కనీసం ఇవన్నీ 100 శాతం ఉండక్కర్లేదు. కానీ, వీటిలో 0.001 శాతం లక్షణాలు కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం కొన్నిటిని ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది.
నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని అయినా అబద్ధాన్ని కూడా నిజంగా చేసేయగలమనే కాన్ఫిడెన్స్‌తో బతుకుతారో సమాజంలో.. అలాంటి వాటికి ఓటేస్తున్నట్లు. ఎంత లేకి పని అయినా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతకొచ్చు అని అనుకునే వారికి ఓటేస్తున్నట్లు. ఏదైనా చేసి సిగ్గులేకుండా సిగ్గులేని తననాన్ని ప్రోత్సహించవచ్చని అనుకునేవాళ్లకి ఓటేస్తున్నట్లు. ఇలాంటివారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి మీ సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి, మంచి నాయకుడ్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’’ అని డాక్టర్ గౌతమ్ ఓ వీడియోను విడుదల చేశారు.