ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవోఐఆర్‌టీ వెబ్‌సైట్‌లో జీవోలను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించింది. జీవోలను ఈ-గెజిట్ లో ఉంచుతామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ...ఈ-గెజిట్‌లో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో జీవోలు పెట్టడంలేదన్నారు. కేవలం 4-5 శాతం జీవోలు ఉంచుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ టాప్ సీక్రెట్ జీవోలు మాత్రమే అప్‌లోడ్ చేయట్లేదని కోర్టుకు తెలిపారు. కోర్టు స్పందిస్తూ జీవోలు రహస్యం, అతి రహస్యమని ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అన్ని జీవోల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రహస్య జీవోల వివరాలను తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల ఈ నెల 28కి వాయిదా వేసింది.


Also Read: చంద్రబాబు క్షమించినా ... నేను వదలను.. వైఎస్‌ఆర్‌సీపీ లీడర్స్‌కు లోకేష్‌ మాస్‌ వార్నింగ్


ఈ-గెజిట్ లో జీవోలు


ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో జీవోల విడుదల నిలిపివేసింది. జీవోలు అధికారికంగా విడుదల చేయకుండా సీక్రెట్ ఉంచడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ-గెజిట్ ద్వారా జీవోలు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ ఈ-గెజిట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టకుండా నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు అవసరం లేని వ్యక్తిగతమైన సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందుబాటులో ఉంచమని స్పష్టం చేసింది. అవసరమైన జీవోలు సంబంధిత అధికారి డిజిటల్‌ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.


Also Read: నెల్లూరులో భారీ స్కామ్, అసలు వాహనాలే లేవు.. అయినా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు, ఎలా జరిగిందంటే..


Also Read: అగ్గిపెట్టె నుంచి అంతరిక్షం వరకు అన్నీ సీసాలోకి ఎక్కిం చేస్తాడు 


Also Read: మౌనవ్రతం ఇంకెన్నాళ్లు.. అయోమయంలో రఘువీరారెడ్డి అభిమానులు.. ఏపీ పీసీసీ మాజీ చీఫ్ టీడీపీలో చేరనున్నారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి