AP High Court ordered the Palnadu police to file cases against Vidadala Rajani:ఏపీ మాజీ మంత్రి విడదల రజనీకి వరుసగా చిక్కులు వస్తున్నాయి. తాజా గా ఓ సోషల్ మీడియా వేధింపుల కేసులో ఆమెపై రెండు వారాల్లోగా కేసులు పెట్టాలని ఏపీ హైకోర్టు పల్నాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోటి అనే టీడీపీ కార్యకర్త  దాఖలుచేసిన పిటిషన్ పై విచారణ జరిపి ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ తీసుకుంది.  కోటి అనే టీడీపీ కార్యకర్త విడుదల రజనీ తనను సోషల్ మీడియా కేసులో అరెస్టు చేయించి కొట్టించారని ఆ వీడియోను లైవ్ లో చూశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు పెట్టకపోవడతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  


చిలకలూరిపేట ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు అలియాస్ కోటీ ఉండేవారు. ఓ పోస్టు విషయంలో పోలీసులు తనను ఐదు రోజులపాటు స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని కోటి ఆరోపించారు. తనను చిత్రహింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీమంత్రి రజనీ, ఆమె వ్యక్తిగత సహాయకులు జయఫణీంద్రకుమార్, రామకృష్ణ, చిలకలూరిపేట అప్పటి సీఐ సూర్యనారాయణపై ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు గత ఏడాది నవంబర్ లో ఫిర్యాదు చేశారు.  వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నామంటూ తనను నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు పెట్టారని, చిలకలూరిపేట అప్పటి సీఐ తనను కొడుతున్న దృశ్యాలను నాటి మంత్రి విడదల రజనీకి చూపించారన్నారు. అయితే పోలీసులు కేసులు పెట్టలేదు. ఆయన న్యాయపోరాటం ద్వారా కేసులు పెట్టేలా చేసుకున్నారు. 



Also Read: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్




రాజకీయ కక్ష సాధింపులు అనుకుంటారని అనుకున్నారేమో కానీ పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. బాధితులు హైకోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటున్నారు తాజాగా హైకోర్టు ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.  పోలీసుల్ని ఉపయోగించి టీడీపీ కార్యకర్తలపై పెద్ద ఎత్తున వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.   


Also Read:  వైసీపీ కార్యకర్తలకు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్ చెప్పిన జగన్‌- ఇక ర్యాంపేజ్ తప్పదని ప్రత్యర్థులకు వార్నింగ్