AP High Court : ఈస్ట్ గోదావరిలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నాడనే నెపంతో అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లోనే దళిత యువకుడికి శిరోమండనం చేసిన కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులపై పెట్టిన కేసులో తదుపరి విచారణ జరపకుండా 2020 లో రాష్ట్ర హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. విచారణ పూర్తి కాకుండా నిందితులు వేసిన క్వాష్ పిటిషన్ పై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేవని సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరిన న్యాయవాదులు. వాదనలతో ఏకీభవించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వైసీపీ నేత కవల కృష్ణమూర్తి అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. ఇక ఈ కేసుపై బాధితుడి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది. ఈ కేసును తక్షణం విచారించేలా ఫైలును సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్‌కుమార్ ఆదేశాలిచ్చారు.
క్సలైట్‌గా మారేందుకు అవకాశమివ్వాలంటూ గతంలో బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ అంశాన్ని పరిశీలించాలని ఏపీ జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్‌బాబుకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. అనంతరం జనార్దనబాబును తాను సంప్రదించినా స్పందనలేదని బాధితుడు ప్రసాద్ వాపోయాడు. ఈ నేపథ్యంలో కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ తాజాగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కేసులో ్ప్పట్లోనే ట్రైనీ ఎస్సై ఫిరోజ్‌షాను అరెస్టు చేశారు. అంతేకాదు అతడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై నా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్సీ యువకుడు ఇండుగుబిల్లి ప్రసాద్‌కు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఫిరోజ్ సమక్షంలోనే తీవ్రంగా కొట్టి, ట్రిమ్మర్‌తో శిరోముండనం చేశారు.
ఈ కేసులో చర్యలు తీసుకోకపోవడంతో దళిత వర్గాలు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశాయి. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు హైకోర్టు నిందితుల క్వాష్ పిటిషన్లు కొట్టి వేసి విచారణకు అంగీకారం తెలుపడంతో దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.