AP High Court: ఏపీలోని ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ విషయమై హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజు నియంత్రణ విషయంలో ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నాయి. కళాశాలల తరఫున న్యాయవాది శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. ఏటా ఫీజులు తగ్గించుకుంటూ వెళ్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రెగ్యులేటరీ కమిషనర్ చట్టం, నియమాలకు విరుద్ధంగా వెళ్తున్నారంటూ వివరించారు. రెగ్యులేటరీ కమిషన్ తరఫున సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపించగా.. హైకోర్టు ధర్మాసనం స్పందించింది. కమిషన్ విద్యా సంస్థలకు ముందస్తు అవకాశం ఇచ్చిందో లేదో చెప్పాలని, అప్పటి వరకు ఫీజులపై నోటిఫికేషన్ ఇవ్వకూడదిన వెల్లడించింది. తదుపరి విచారణను ఇదే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.