AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్ఎస్(Employee Health Scheme) కార్డు ద్వారా మెడికల్ సర్వీసులు పొందేందుకు అవకాశం కల్పించింది. ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ లిస్ట్‌లో కొత్తగా 565 వైద్య సేవలను చేర్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ఉద్యోగ సంఘాలుతో నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈహెచ్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు పొందిన వారికి బిల్లులను ఆరోగ్య శ్రీ స్కీమ్ విధానంలో 21 రోజుల్లో ఆటోడెబిట్ స్కీమ్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదించింది. 


ఈహెచ్ఎస్ కార్డుపై వైద్య సేవలు 


ఈ విధానం వల్ల రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. నెట్ వర్క్ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయం కోసం ఆరోగ్య మిత్రలకు విధివిధానాలు జారీచేస్తామని ప్రభుత్వం తెలిపింది.  ఇందుకు సంబంధించి  ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


జీవో 203 విడుదల 


ఏపీ ప్రభుత్వం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌పై ఆర్థికశాఖ ఆమోదంతో జీవో 203 విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ కింద 565 ప్రొసీజర్స్ అన్నింటినీ ఈహెచ్ఎస్ కు కూడా వర్తించే విధంగా సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కార్డుపై వైద్యసేవలు పొందిన వారికి బిల్లులను 21 రోజుల్లోగా ఆటో డెబిట్‌ స్కీమ్‌ ద్వారా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈహెచ్ఎస్(EHS) కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం పొందేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.    


సచివాలయ సిబ్బంది బదిలీలపై


ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సీఎం జగన్ అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సచివాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, బదిలీలకు అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌ను కోరాయి. బదిలీలకు సీఎం అంగీకరించినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి మీడియాతో అన్నారు. బదిలీలపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని సీఎం చెప్పినట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డితో పాటు వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటి నుంచే పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 


కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులు 


అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు 8 సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన తర్వాత బదిలీ చేశారని, దానిని 5 సంవత్సరాలకు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోందన్నారు. అలా కాకుండా 8 సంవత్సరాలు ఒకే చోట పనిచేసేలా ఉండాలని సీఎంను కోరమని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోల ఎదురుచూపులను సీఎం జగన్‌ ప్రభుత్వం పరిష్కరించడంతో వారు ఆనందంలో ఉన్నారన్నారు.  కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులు సృష్టించి ఏప్రిల్ లో పదోన్నతులు ఇచ్చారని స్పష్టం చేశారు. 


Also Read : Stalin Letter To Jagan : ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్‌కు స్టాలిన్ లేఖ !


Also Read : Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?