ఏపీలో ఉద్యోగుల వేతన సవరణకు 12వ పీఆర్సీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా బుధవారం సాయంత్రం (జూలై 12) జారీ చేసింది. ఈ వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఏడాదిలోగా ఈ వేతన సవరణ సంఘం వివిధ అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉద్యోగుల అందరి వివరాలు, వారికి సంబంధించిన అంశాలతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులు, కరవు భత్యంపై (డ్రాట్ అలవెన్స్) అధ్యయనం చేసిన తర్వాత సిఫార్సులు చేయాలని పీఆర్‌సీకి ప్రభుత్వం సూచించింది.