ఆంధ్రప్రదేశ్ లో మటన్ మార్ట్ లు రానున్నాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మాంసం మార్టులకు ఏర్పాటు చేయనుంది. తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటు చేయనున్నారు. ఇది ఓకే అయితే... గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తారు. రూ.11.20 కోట్లతో 112 మార్ట్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: JSP For Roads: అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కామెంట్స్
మాంసం తినేవారి సంఖ్య పెరుగుతోంది. కల్తీమాంసం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఇక మరోవైపు వైద్యులు కూడా మాంసాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ప్రోటీన్ అధికంగా మాంసంలోనే లభిస్తుందని, శరీరానికి సరైన ప్రోటీన్ అందితే కండరాలు బలంగా తయారవుతాయని అంటున్నారు.
అయితే రాష్ట్రంలో మటన్ దుకాణాలు ప్రమాణ స్థాయిలు తక్కువగా ఉన్నాయని ఆరోగ్య కరమైన పరిస్థితుల్లో ఉండటం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చడానికి మటన్ దుకాణాలు అందుబాటులోకి తేనుంది. మటన్ మార్ట్‌గా పిలిచే ఈ మొబైల్ దుకాణం వాహనమే. పరిశుభ్రమైన వాతావరణంలో కనీసం 10 మేకలు, గొర్రెలను మటన్‌గా మార్చే ఏర్పాట్లు అందులో ఉంటాయి. కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్ విక్రయాలు జరిపేందుకు వీలుగా ఆ వాహనాన్ని డిజైన్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసిన మాంసాన్ని నిల్వ చేసేందుకు రిఫ్రిజరేటర్లు ఇతర ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ వాహనాలను యూనిట్ రూ.10 లక్షల అంచనా వ్యయంతో రానున్నాయి. ముందుగా 112 మంది లబ్దిదారుల్ని ఎంపికచేస్తారు. వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
సినిమా టికెట్లు బుకింగ్ కోసం పోర్టల్
సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టిక్కెట్ల విక్రయానికి సంబంధించి ప్రభుత్వమే ఓ పోర్టల్ డెవలప్ చేయాలని ప్రతిపాదించింది. ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.