ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ ( RBI ) నుంచి మంగళవారం బాండ్ల వేలం ద్వారా రూ. మూడు వేల కోట్ల రుణం తీసుకుంది. పదేళ్లకు, పందొమ్మిదేళ్లకు, ఇరవై ఏళ్ల పరిమితితో బాండ్ల వేలం ద్వారా ఈ రుణం ( Loan ) సేకరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దాదాపుగా రూ. 28 వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. ఇందులో రూ. మూటు వేల కోట్లను మే నెల మొదటి వారం మంగళవారం బాండ్ల వేలంలో తీసుకున్నారు. అత్యధికంగా 7.78 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఏపీతో పాటు హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు మాత్రమే అప్పు తీసుకున్నాయి.
అడ్మిషన్లు పెంచుకునేందుకు పేపర్లు లీక్, టెక్నికల్ ఎవిడెన్స్ తో నారాయణను అరెస్టు చేశాం : ఎస్పీ
ఏయితే ఏపీ ప్రభుత్వం ( Ap Govt ) తీసుకున్న రూ. మూడు వేల కోట్లలో ఇప్పటికే ఆర్బీఐ వద్ద రూ. 2118 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ( Over Draft ) ఉండటంతో జమ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రుణం తీసుకున్న వెంటనే ఓవర్‌డ్రాఫ్ట్‌కు సంబంధించిన రూ.2,118 కోట్లు రిజర్వు బ్యాంకులో జమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కేవలం రూ.872 కోట్లు మాత్రమే ఇతర అవసరాలకు మిగిలినట్లు సమాచారం. ఏప్రిల్ నెలను ఎటువంటి ఓవర్‌డ్రాఫ్ట్ లేకుండానే నెట్టుకు వచ్చిన ఆర్థికశాఖ మే నెల్లో మాత్రం ఓడికి ( OD ) వెళ్లకతప్పలేదు.
పరిశ్రమలకు పవర్ హాలీడే ఎత్తివేత - డిమాండ్ తగ్గడంతో ఏపీ సర్కార్ నిర్ణయం !
ఏప్రిల్ ఆఖరులో మిగుల్చుకున్న నిధులతో మే ఒకటో తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. దీంతో ఖజానా ఖాళీ కావడంతో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లను అందించలేకపోయారు. మూడో తేదీ రంజాన్ కావడంతో నాలుగు, ఐదో తేదీల నుంచి జీతాల చెల్లింపులు ప్రారంభించారు. అందుకే ఐదో తేదీన తప్పనిసరిగా ఓడీకి వెళ్లి జీతాలు చెల్లించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నిధులు కూడా చాలకపోవడంతో చాలామందికి ఇంకా జీతాలు పడలేదని తెలిసింది.
నారాయణ పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ - తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దని జగన్ చెప్పారన్న సజ్జల !
బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా వచ్చిన నిధులను జీతాలు, పింఛన్లకు వినియోగించుకోవాలంటే అందులో కూడా సింహభాగం నిధులు ఓడి రూపంలో రిజర్వు బ్యాంకులో జమైపోయాయి. ఏపీలో ఇంకా కొంత మందికి జీతాలు ఇవ్వాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది.