Andhra Pradesh Govt issues show cause notices to secretariat staff | అమరావతి: 15 వేల మంది సచివాలయ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బంది 15వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం కొన్ని నెలల కింటే రూల్స్ తీసుకొచ్చింది. అయితే కొందరు సచివాలయ ఉద్యోగులు ఇష్టరీతిన ప్రవర్తిస్తున్నారు. వారిపై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో 13 రోజులు పాటు వరుసగా బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బయోమెట్రిక్ వేయక పోవడంపై వారిని వివరణ కోరింది. ఒకవేశ వారు చెప్పిన వివరణతో సంతృప్తి చెందకపోతే ఉన్నతాధికారులు సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.