HRA Hiked To AP Secretariat Employees: ఏపీ ప్రభుత్వం (AP Government) సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయం ఉద్యోగులకు హెచ్ఆర్ఏను పెంచాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను (HRA) 24 శాతానికి పెంచుతూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం రూ.25 వేలకు మించకుండా వర్తింపచేయాలని నిర్ణయించగా.. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పీఆర్సీ సిఫారసులు ఇంకా రానందున.. 2025 జూన్ వరకూ హెచ్ఆర్ఏ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.


Also Read: Minister Convoy: మంత్రి వాహనం ముందు బట్టలిప్పి యువకుల వీరంగం - మద్యం మత్తులో హల్‌చల్, పోలీసులు ఏం చేశారంటే?