Supreme Court :  తెలుగుదేశం పార్టీ హయాంలో  ఉద్యోగాలు పొందామన్న కారణంగా తమను  ప్రస్తుత ప్రభుత్వం తొలగించడంపై ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రొఫెసర్లు చేస్తున్న పోరాటం ఫలించింది.   ప్రొఫెసర్లను కొనసాగించడానికి సుప్రీంలో  ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.  2019 కు ముందు జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొపెసర్ల నియామకాలు చెల్లవని గతంలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేశారు ప్రొఫెసర్లు.  అయితే హైకోర్టులో  జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.  హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఫ్రొపెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ..సీనియర్ లాయర్లతో వాదనలు వినిపించారు.                                        

  


 రిజర్వేషన్లను పాటిస్తూనే తమ నియామకం జరిగిందని   ప్రొపెసర్ల తరపు సీనియర్ న్యాయవాది రాజగోపాల్ వాదించారు. రిజర్వేషన్లను అమలు చేసిన తరువాత ప్రొఫెసర్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏపీ ప్రభుత్వ లాయర్ ను ప్రశ్నించారు. దీంతో ప్రొఫెసర్ల వరకూ కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని కొర్టుకు తెలిపారు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు. ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసుకొని ప్రొఫెసర్లను వెంటనే నియమించాలన్న సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమాకంపై మాత్రం తదుపరి విచారణ వాయిదా వేసింది.                                      


ఆంధ్రప్రదేశ్‌లో ్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2017, 2018 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో అవకతవకలు జరిగాయని ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లను రద్దు చేసింది.   గత ప్రభుత్వ హయాంలో రెగ్యులర్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టలేదని  ప్రభుత్వం భావించింది.  విధివిధానాలు, నియమనిబంధనలు నోటిఫికేషన్లో సక్రమంగా పొందుపరచకుండానే భర్తీ ప్రక్రియ చేపట్టారని గుర్తించారు.   హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేసి 2019, జనవరిలో ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు చేపట్టారని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రొఫెసర్ పోస్టుల భర్తీతో తప్పిదాలు జరిగాయన్న  ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది.                            


పీహెచ్డీ పూర్తి చేసి ఐదేళ్ల అనుభవం ఉంటేనే ప్రొఫెసర్ పోస్టుకు అర్హులు. ఈ నిబంధన పాటించకుండా  ప్రొఫెసర్ పోస్టులు కట్టబెట్టారని..  మిగిలిన వారి విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వ వాదించింది.  ఈ నిర్ణయానికి హైకోర్టు సమర్థించింది.  రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2017, 2018 సంవత్సరాల్లో జారీచేసిన నోటిఫికేషన్లను  రద్దు చేయడాన్ని సమర్థించింది.  ఈ తీర్పును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా పలువురు  ప్రొఫెసర్లు ఉద్యోగాలు కోల్పోయారు. వీరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఊరట లభించింది.