Adudam Andhra: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నారు. గ్రామ , వార్డు సచివాలయ, మండల , నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు. 15 ఏళ్ల వయసు పైబడిన అందరూ రిజిస్ట్రేషన్ కు అర్హులే.. మొత్తం ఐదు దశల్లో 2.99 లక్షల మ్యాచ్‌లు, ఈవెంట్లు నిర్వహించనున్నారు.
15 ఏళ్లు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖోతో పాటు 3కే మారథాన్, యోగా, టెన్నికాయిట్ వంటి పోటీలను నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడల్లోనూ పోటీలను పెట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి.. వారు మంచి తర్ఫీదు పొందేలా శాప్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలో బాలబాలికలకు విడివిడిగా స్పోర్ట్స్ కిట్లను అందించనుంది. బ్యాడ్మింటన్ రాకెట్లు, రింగ్‌లు, క్రికెట్ కిట్, వాలీబాల్‌లు సమకూర్చనుంది. 26 జిల్లాల వారీగా ఎన్ని కిట్లు అవసరమో వాటి జాబితాను సిద్ధం చేస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో నిర్వహిస్తోన్న మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఇది.. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులని కనుగొని వారిని పెద్ద వేదికకు పరిచయం చేయడం.. క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యం.
విజేతలకు ప్రైజ్‌మనీ కింది రూ.12 కోట్లు ఇవ్వనున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో పోటీలకు నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో ప్రైజ్ మనీ రూ.60 వేలు, రాష్ట్రస్థాయి ప్రైజహమనీ రూ.5 లక్షలుగా ఉంది.. అదే రెండో ప్రైజ్ విషయానికి వస్తే నియోజకవర్గస్థాయిలో రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30వేలు, రాష్ట్రస్థతాయిలో రూ.3 లక్షలుగా నిర్ణయించారు.. ఇక, మూడో ప్రైజ్‌గా నియోజకవర్గ స్థాయిలో రూ.5వేలు, జిల్లాస్థాయిలో రూ.10వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
బ్యాండ్మింటన్ డబుల్స్ విభాగంలో మొదటి బహుమతి ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లాస్థాయిలో రూ.35 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు. రెండో ప్రైజ్‌గా నియోజకవర్గస్థాయిలో రూ.10వేలు, జిల్లాస్థాయిలో రూ.20 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.లక్షగా.. మూడో ప్రైజ్ కింద నియోజకవర్గ స్థాయిలో రూ. 5వేలు, జిల్లాస్థాయిలో రూ.10వేలు, రాష్ట్రస్థాయిలో రూ.50వేలుగా నిర్ణయించారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానిక 15 ఏళ్లు పైబడిన వారందరూ అర్హులే. 1092కి కాల్ చేయడం ద్వారా లేదా మీపంలోని ఉన్న సచివాలయాన్ని సంప్రదించవచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ టోర్నమెంట్లను నిర్వహించనున్నారు.