Trending
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
AP government: గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాల్ని కాపాడేందుకు Tenecteplase అనే ఇంజక్షన్ ఉంది. అది చాలా ఖరీదు. ఇప్పుడు ఏపీలో అన్ని పీహెచ్‌సీలలో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు.
AP government has made the expensive injection available in all PHCs: ఏపీ ప్రభుత్వం సైలెంట్ గా ప్రజల కోసం ఓ అద్భుతమైన పని చేసింది. గుండెపోటు మరణాలను నివారించేందుకు ఖరీదైన ఇంజెక్షన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. దానికి కారణాలేమిటన్నదాన్ని పక్కన పెడితే గుండెపోటు వచ్చిన వెంటనే కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. సీపీఆర్‌లు చేయడంతో పాటు.. టెనక్టప్లేస్ అనే ఇంజెక్షన్ ఇస్తే.. ప్రాణం నిలుస్తుంది. అయితే ఇది అత్యంత ఖరీదైనది. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు నలభై వేలు ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ను ప్రభుత్వం అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచుంది.
గుండెపోటు వచ్చిన వారు కంగారు పడవద్దని ఈ దగ్గర పీహెచ్‌సీల్లో ఇంజెక్షన్ అందుబాటులో ఉంటుందని గ్రామాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు వచ్చిన వెంటనే గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించే సమయం కూడా ఉండదు. గుండెపోటు వచ్చిన వారిని తొలి గంటలో ఆస్పత్రికి తీసుకు వస్తే ప్రాణాలు నిలపవచ్చని డాక్టర్లు చెబుతారు. ఆ గంటలో గ్రామీణ ప్రాంతాల్లో తీసుకెళ్లలేకపోవచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో మరణాలను నివారించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీహెచ్‌సీలలో టెనక్టప్లేస్( TPA ) ఇంజక్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
సీపీఆర్ చేస్తే ఆస్పత్రి తీసుకెళ్లే వరకు అది ఎంత సేపు వరకు పనిచేస్తుందో తెలియదు. వాహనం అందుబాటులోకి లేకపోతే మరింత కష్టం. గుండెపోటుకు గురైన వ్యక్తిని నాలుగు గంటల్లో ఆస్పత్రికి తీసుకువచ్చి టెనక్టప్లేస్(టీపీఏ) అనే ఇంజెక్షన్ ఇస్తే కోలుకునే అవకాశం ఉంది. గుండెపోటు అని ఈసీజీలో తేలితే అవసరమైన ప్రాథమిక వైద్యం చేసి పీహెచ్‌సీలలోనే టెనక్టప్లేస్(టీపీఏ) ఇంజెక్షన్ ఇస్తారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రులకు పంపుతారు. ఈ గోల్డన్ అవర్స్‌లలో ఈ టెనక్టప్లేస్(టీపీఏ) ఇంజక్షన్ ఒక ప్రాణదాత అని చెప్పాల్సిన పనిలేదు.