AP Government Extended Holidays For Banks: సంక్రాంతి సందర్భంగా బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. వారికి పండుగ సెలవులు మరో రోజు పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2025 ప్రభుత్వ సెలవుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సర్కారు జనవరి 14న సంక్రాంతి రోజు మాత్రమే సెలవుగా ప్రకటించింది. కనుమ రోజు బుధవారం యథావిధిగా బ్యాంకులు పని చేస్తాయని తొలుత వెల్లడించింది. అయితే, కనుమ రోజు కూడా సెలవు ప్రకటించాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనియన్ కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. కనుమ రోజు కూడా సెలవును పొడిగించింది. దీంతో మంగళ, బుధవారాల్లో బ్యాంకులకు హాలిడే ఉండనుంది. ఈ మేరకు సవరించిన జీవో నెం.73ను విడుదల చేసింది.


Also Read: Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!