Kite worth crore rupees: ఈ రోజుల్లో పబ్లిసిటీకి ఎలాంటి ఐడియాలు కావాలంటే అలాంటి ఐడియాలు వాడేస్తున్నారు జనం. రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ రావాలంటే ఒంటి మీద బంగారం అంతా దిగేసుకుని తిరిగితే చాలు. చాలా మంది ఇది మంచి పబ్లిసిటీ అనుకుని.. పెద్ద ఎత్తున బంగారం చేయించుకుని తమ వంటిమీద వేసుకుని తిరుగుతున్నారు. ఇలాంటి గోల్డ్ మెన్లు పెరిగిపోయారు. నిజంగా వారి ఒంటి మీద ఉన్నది ఒరిజినల్ గోల్డా.. వన్ గ్రామ్ గోల్డా అన్నది తెలియదు కానీ.. మొడలో సంకెళ్లులా ఆ బంగారం గొలుసుల్ని వేసుకుని తిరేగేస్తున్నారు. ఇలాంటి ఓ వ్యక్తి మరో అడుగు ముందుకు వేశాడు.
కోటి రూపాయలతో పతంగి.. నలభై లక్షలతో మాంజా తయారు చేయించానని ప్రచారం
తన ఇంటి మీదే కాదు.. తాను ఎగురవేసే పతంగా కూడా బంగారదేనని ప్రకటించుకున్నాడు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాయి. కోటి రూపాయల పతంగిని ఎలా చేస్తారని అందరూ ఆశ్చర్యపోయారు. బంగారం తో తయారు చేసిన పతంగికి..త వజ్ర వైడూర్యాలు జత చేశారట. అంతే కాదు..తాను ఆ పతంగిని ఎగురవేయడానికి నలభై లక్షలు పెట్టి మాంజాను కూడా తయారు చేయించానని చెబుతున్నారు. ఆయన హడావుడి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామని ఎగబడుతున్నారు.
అతనిది అంతా పబ్లిసిటీ పిచ్చి అంటున్న పాతబస్తీ వాసులు
అతను చేసుకునే ప్రచారానికి అతని బిల్డప్‌కు.. అతని సంపాదనకు పెద్దగా పోలిక లేదు. దీంతో ఆయన ప్రచారం కోసం హడావుడి చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా పతంగికి బంగారం.. వజ్రాలు పొదిగినట్లయితే.. ఎగరదని గుర్తు చేస్తున్నారు. కేవలం తేలికపాటి పేపర్ అయితేనే ఎగురుతుందని.. అది కూడా గాలి వాటుకు తట్టుకునేలా ఉంటేనే అని గుర్తు చేస్తున్నారు. లోహాలతో తయారు చేసే పతంగులు ఎగరాలంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. పైగా ఈయన మాంజాను కూడా నలబై లక్షలు రూపాయుల పెట్టి చేయించానని గొప్పలు పోతున్నారు.
సోషల్ మీడియాలో ఫేమ్ కోసమే ఈ పని
ఈ వ్యక్తి చేసేదంతా పబ్లిసిటీ స్టంటేనని .. అతని చుట్టుపక్కల ఉన్న వారు చెబుతున్నారు. పాతబస్తీలో ఉండే అతను.. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం గోల్డెన్ మ్యాన్ లావేషాలు వేసుకుని వ్యూస్ సంపాదించుకుంటూ ఉంటారని.. అతనికి కోటి రూపాయలు పెట్టి పతంగా చేయించేంత సీన్ లేదంటున్నారు. దాంతో అతను సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు.
Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం