Special Officers In Vijayawada: భారీ వర్షాలతో విజయవాడ (Vijayawada) నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నేవీ హెలికాఫ్టర్లు సైతం రంగంలోకి దిగి బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి మూడు పూటలా ఆహారం, తాగునీరు.. అవసరమైన వారికి మెడిసిన్ అందిస్తున్నారు. విజయవాడలోనే ఉన్న సీఎం చంద్రబాబు వరద పరిస్థితి, బాధితులకు అందుతోన్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు విధంగా ఆదేశాలిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యేలా ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తారు. 

అధికారుల వివరాలు - ఫోన్ నెంబర్లు

విజయవాడ సెంట్రల్..

  • ఇందిరానగర్ కాలనీ - సుధాకర్ 9640909822
  • రామకృష్ణాపురం - వెంకటేశ్వర్లు 9866514153
  • ఉడా కాలనీ - శ్రీనివాస్ రెడ్డి 9100109124
  • ఆర్ఆర్ పేట - వి. పెద్దిబాబు 9848350481
  • ఆంధ్రప్రభ కాలనీ - అబ్దుల్ రబ్బానీ 9849588941
  • మధ్యకట్ట - టి. కోటేశ్వరరావు 9492274078
  • ఎల్బీఎస్ నగర్ - సీహెచ్ శైలజ 9100109180
  • లూనా సెంటర్ - పి. శ్రీనివాసరావు 9866776739
  • నందమూరి నగర్ - యు. శ్రీనివాసరావు 9849909069
  • అజిత్‌సింగ్ నగర్ - కె. అనురాధ 9154409539
  • సుబ్బరాజునగర్ - సీహెచ్ ఆశారాణి 9492555088
  • దేవినగర్ - కే.ప్రియాంక 8500500270
  • పటేల్ నగర్ - కె. శ్రీనివాసరావు 7981344125

విజయవాడ పశ్చిమ..

  • జోజినగర్ - వీకే విజయశ్రీ 9440818026
  • ఊర్మిలా నగర్ - శ్రీనివాస్ 8328317067
  • ఓల్డ్ ఆర్ఆర్ పేట - ఎస్ఏ ఆజీజ్ 9394494645
  • పాల ఫ్యాక్టరీ ఏరియా - జె. సునీత 9441871260

విజయవాడ తూర్పు..

  • రాజరాజేశ్వరీ నగర్ - పి.వెంకటనారాయణ 7901610163
  • మహానాడు రోడ్డు - పి.బాలాజీ కుమార్ 7995086772
  • బ్యాంకు కాలనీ - హేమచంద్ర 9849901148
  • ఏపీఐఐసీ కాలనీ - ఎ. కృష్ణచైతన్య 9398143677
  • కృష్ణలంక - పీఎం సుభాని 7995087045
  • రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959

విజయవాడ రూరల్..

  • గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852
  • రాయనపాడు - సాకా నాగమణెమ్మ 8331056859
  • జక్కంపూడి - నాగమల్లిక 9966661246
  • పైడూరుపాడు - శ్రీనివాస్ యాదవ్ 7416499399
  • కేవీ కండ్రిక - మహేశ్వరరావు 9849902595
  • అంబాపురం - బి.నాగరాజు 8333991210

కమాండ్ కంట్రోల్ నుంచి మంత్రి లోకేశ్ పర్యవేక్షణ

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల తాజా పరిస్థితులపై మంత్రి లోకేశ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. వరద అంచనా, బోట్ ఆపరేషన్, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై అధికారులతో సమీక్షించారు. దాదాపు 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీరు సహా బాధితుల తరలింపు కొనసాగుతోందని అన్నారు. సింగ్ నగర్, రామేలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుంచి 15 వేల మందికి పైగా నిరాశ్రయులను తరలించారు. అటు, వరద ప్రాంతాల్లో సెల్ టవర్స్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు బాద్యతలు అప్పగించినట్లు చెప్పారు. డ్రోన్ల సహకారంతో ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ అధికారులకు తగు ఆదేశాలిస్తున్నారు. మరోవైపు, ఈ నెల 5న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Rains: వాతావరణ శాఖ అలర్ట్ - ఏపీలో మళ్లీ వర్షాలు, తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన