ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు.  అనంతపురం, కృష్ణా జిల్లా వంటి చోట్ల విద్యార్థులు రోడ్డెక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో  మీడియా ముందుకు వచ్చి ఎయిడెడ్ విషయంలో వివరణ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉందని ప్రకటించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 


Also Read : పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?


స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యాసంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని.. మిగిలిన విద్యా సంస్థలు వారు నడుపుకోవచ్చని ప్రకటించారు. తాము విద్యా సంస్థల్లో సంస్కరణలకు ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా.. చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆందోళనలు చేస్తున్న వారికి సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ఆస్తులతో సహా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని లేకపోతే సొంతంగా నడుపుకోవాలని జీవో నెం.42 విడుదల చేసింది. ఎయిడ్ నిలిపివేసింది. 


Also Read : పంచ్ ప్రభాకర్‌ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?


ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్న స్టాఫ్‌ను ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి నిర్ణయించారు. ఈ కారణంగా అనేక ఎయిడెడ్ విద్యా సంస్థలు ఫీజులు పెంచడమో.. లేకపోతే  విద్యా సంస్థను మూసి వేయడమో చేస్తున్నాయి. అందుకే విద్యార్థుల రోడ్డెక్కుతున్నారు. విశాఖ సహా అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎయిడ్ ఆపబోమని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే జీవో నెం.42పై వెనక్కి తగ్గతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాయి. 


Also Read : ఏం కావాలన్నా అడగండి.. బాధితులకు రూ.1000 చొప్పున ఖర్చులకు ఇవ్వండి


కానీ ప్రభుత్వం జీవో నెం.42 విషయం మాత్రం వెనక్కి తగ్గలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. తమకు స్పష్టత ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు చెబుతున్నారు కానీ.. విద్యార్థుల ఆందోళలను తగ్గించే దిశగా ఎలాంటి చర్యలు ప్రకటించలేదు. అయితే ఆ ఆందోళనలపై టీడీపీ ముద్ర వేయడంతో రాజకీయంగా వ్యవహారం మారే అవకాశం కనిపిస్తోంది. 


Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి