అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోలేకపోతే సీఎం జగన్ తన పదవి నుండి తప్పుకోవాలని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చేసి చూపిస్తామని అన్నారు.
రైతులను ఆదుకోవాలని కన్నా డిమాండ్..
రైతులు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు తనకు మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ ఉంటే చాలు అని జగన్ అనుకుంటున్నారని మాజీ మంత్రి , తెలుగుదేశం నేత కన్నా లక్ష్మినారాయణ ఫైర్ అయ్యారు. తనకు రావాల్సిన ఆదాయం వస్తుంది అన్న ధీమాలో జగన్ ఉన్నారని కన్నా వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్నిఆదుకోవడం జగన్ కు చేతగాకపోతే, తక్షణమే సీఎం కుర్చీనుంచి దిగిపోవాలన్నారు. జగన్ తన పదవినుంచి తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయంచేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని చెప్పారు. పంటల బీమా సొమ్ము సకాలంలో చెల్లించని జగన్ ప్రభుత్వ నిర్లక్షమే రైతుల కన్నీళ్లకు ప్రధానకారణమని కన్నా వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో మిల్లర్లు, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న రైతుల దోపిడీ జగన్మోహన్ రెడ్డికి కనిపించడంలేదా అని కన్నా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగే అక్రమాలు అరికట్టి, రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజను ప్రభుత్వమే నేరుగా గిట్టుబాటుధరకు కొనాలని డిమాండ్ చేశారు.
మేనిఫెస్టో సంగతి ఏంటి...
తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన రూ.2వేలకోట్ల ప్రకృతి విపత్తుల సహాయనిధి, రూ.3వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో జగన్ రైతులకు సమాధానంచెప్పాలని మాజీ మంత్రి ,తెలుగు దేశం నేత కన్నా లక్ష్మినారాయణ అన్నారు.అకాలవర్షాలకు సర్వం కోల్పోయిన రైతులు విలపిస్తుంటే, ముఖ్యమంత్రి నీరోచక్రవర్తిలా తనకే మీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని, ధాన్యం మొలకెత్తి, మిర్చి నీళ్లపాలై, ఇతరపంటలు పొలా ల్లోనే కుళ్లి మగ్గిపోతుంటే, మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం రైతుల ముఖం కూడా చూడకుండా నిద్రపోతోందని కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తెలుగుదేశమే ముందు...
రైతుల కష్టాలను తెలుసుకొని వారికి అండగా ఉండటంలో తెలుగుదేశం పార్టీ ముందుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాల్లో వరి రైతుల వద్దకు వెళ్లి, వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారని చెప్పారు. కానీ రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వ డొల్లతనం, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అకాల వర్షాలతో మరోసారి బట్టబయలైందని కన్నా వ్యాఖ్యానించారు. చంద్రబాబు రైతులవద్దకు వెళ్లకుండా ఉంటే, అసలు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కనీసం నోటి మాటగా కూడా రైతుల ప్రస్తావన చేసేవారు కాదన్నారు. ఏం చేసినా చేయకపోయినా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చాలు ఆదాయం అదే వస్తుంది అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నాడని కన్నా కామెంట్స్ చేశారు.
తడిచిన ధాన్యంపై ఎందుకు నిర్లక్ష్యం...
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో రైతులను నిలువునా మోసగిస్తున్నారని కన్నా అన్నారు. 75కిలోల ధాన్యం బస్తాకు ఒకచోట 5కేజీలు, మరోచోట 12కేజీలు అదనంగా ధాన్యం ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తు న్నారని, కొన్నిచోట్ల మిల్లర్లను అడ్డంపెట్టుకొని ప్రభుత్వమే బస్తాకు రూ.100నుంచి రూ.200 లు అనధికారికంగా వసూలుచేస్తోందని కన్నా తెలిపారు. లారీ ధాన్యానికి కొన్నిచోట్ల మిల్లర్లు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు రైతుల నుంచి దండుకుంటున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతుల కష్టాన్ని అప్పనంగా దోచుకుంటున్నాకూడా ప్రభుత్వంలో చలనంలేదని, పాలకుల్లో స్పందన లేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయని ధ్వజమెత్తారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఈ వి ధంగా వివిధ పద్ధతుల్లో మిల్లరు, అధికార యంత్రాంగం దోచుకోవడం సరైంది కాదని హితవు పలికారు.
రైతులను ఆదుకోలేని సీఎం ఎందుకు, జగన్ రాజీనామా చేయడం బెటర్ - టీడీపీ నేత కన్నా
ABP Desam
Updated at:
09 May 2023 07:08 PM (IST)
జగన్ తప్పుకుంటే... రైతులకు ఏమి చేస్తామో..చూపిస్తాం...టీడీపీ నేత ..కన్నా
కన్నా లక్ష్మీనారాయణ
NEXT
PREV
Published at:
09 May 2023 07:08 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -