త కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న అనసూయ మరోసారి ట్విట్టర్‌లో యాక్టీవ్ అయ్యింది. ఈసారి కూడా ఆమె హీరో విజయ్ దేవరకొండనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషీ’ పోస్టర్‌లో.. ‘The Vijay Devarakonda’ అని ఉండటంపై అనసూయ స్పందించినట్లుగా నెటిజనులు భావిస్తున్నారు. అనసూయ తాజా ట్వీట్‌లో దీనిపై స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’’ అని పేర్కొంది. ఆమె ఇక్కడ ఎవరి పేరునీ మెన్షన్ చేయనప్పటికీ, 'The' అనే పదాన్ని ప్రస్తావించడం వల్ల ఆమె రౌడీ బాయ్ విజయ్ దేవరకొండనే ఆమె టార్గెట్ చేసినట్లు అర్థమవుతోందని అంటున్నారు. ఇంకేముంది.. ఆ ట్వీట్ చూడగానే విజయ్ దేవరకొండ అభిమానులు రంగంలోకి దిగారు. 


‘ఖుషి’ పోస్టర్‌లో ‘The Vijay Devarakonda’ అని పేర్కొనబడింది. ‘The’ అనే పదాన్ని యూనిక్ విషయాలకు, వస్తువులకు వాడుతూ ఉంటారు. ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా ఒక యూనిక్ అని అర్థం వచ్చేలా ఇలా పేరు ముందు ఇలా ‘The’ పదాన్ని యాడ్ చేసి ఉంటారని తెలుస్తోంది. అదే ఇప్పుడు అనసూయకు అస్సలు నచ్చలేదంటూ నెటిజనులు అంటున్నారు. ఆ ట్వీట్ చేసిన రోజు నుంచి విజయ్ అభిమానులు అనసూయను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొందరైతే దారుణంగా తిడుతున్నారు. అయితే, అనసూయ అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్న ట్వీట్లను అనసూయ టేకిట్ ఈజీ అన్నట్లుగా తీసుకుంటోంది. కూల్‌గా స్పందిస్తోంది. 




తాజాగా తనపై వస్తున్న వరుస ట్వీట్లపై స్పందిస్తూ.. ‘‘అంటే ఇంతమంది వత్తాసు పలికితే గానీ పనవ్వదన్నమాట. ‘అతడు’ సినిమాలో బుజ్జిని పార్థు అడిగినట్లు. ‘‘అదే ఇంతమందేంటి అని.. నా ఒక్కదాని కోసం. ఏమో బాబు.. నాకే పీఆర్ స్టంట్లు తెలీవు, రావు, అవసరం లేదు కూడా. కానీయండి, కానీయండి’’ అని పేర్కొంది. ఆ తర్వాత ఒక్కడి కొట్టడం కోసం ఇంత మందా అనే ‘అతడు’ డైలాగ్ వీడియోను పోస్ట్ చేసింది. మొత్తానికి అనసూయ ఇప్పట్లో విజయ్ దేవరకొండపై పరోక్షంగా సెటైర్లు వేయడం మానేలా లేదు. అలాగే, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఆమెను ట్రోల్ చేస్తూనే ఉండేలా ఉన్నారు.




విజయ్ దేవరకొండతో గొడవెందుకు?


నిజానికి అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండ మధ్య వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. 'అర్జున్ రెడ్డి' ప్రమోషన్స్ లో పబ్లిక్ స్టేజ్ మీద "ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ ***" అనే డైలాగ్ చెప్పడంపై అనసూయ బహిరంగంగానే విమర్శలు చేసింది. దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అప్పటినుంచి వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. మధ్యలో విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాలో అనసూయ నటించడంతో అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ ‘లైగర్’ టైంలో మరోసారి అనసూయ కాంట్రవర్సీ తీసుకొచ్చింది.


Also Read : విజయ్ దేవరకొండ బర్త్‌డే గిఫ్ట్ - 'ఖుషి'లో తొలి పాట వచ్చేసిందోచ్!


విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మారిన తరుణంలో, అనసూయ ట్వీట్ చేస్తూ 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అంటూ ఇన్ డైరెక్ట్ గా ట్రోల్ చేసింది. ఇప్పుడు ‘ఖుషి’ పోస్టర్ పైనా పరోక్షంగా ట్వీట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్లు చూస్తుంటే, ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే మర్చిపోయేలా కనిపించడం లేదు. మరి ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.