ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ గౌతం సవాంగ్‌ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బదిలీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. గౌతం సవాంగ్ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గౌతం సవాంగ్‌కు ఇంకా సుదీర్ఘమైన సర్వీస్ ఉంది. వచ్చే ఏడాది జూలై వరకూ ఆయన సర్వీసులో ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడే పోలీసు బాస్‌గా పని చేసి ఉద్వాసనకు గురి కావడంతో ఇప్పుడు ఎలాంటి పోస్టింగ్ ఇస్తుందనేది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మెగాస్టార్ టీం కంటే మంచు విష్ణుకే ఎక్కువ పవర్ ! జగన్‌తో భేటీలో ఇదే హైలెట్...
గౌతం సవాంగ్ అన్న అంటూ ముఖ్యమంత్రి జగన్ ఎంతో ఆప్యాయంగా పిలిచే డీజీపీని హఠాత్తుగా బదిలీ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇటీవల ఆయనకు ఉత్తమ డీజీపీగా అవార్డు కూడా వచ్చింది. అలాగే దేశంలో అత్యుత్తమ పోలీసింగ్ చేస్తున్నట్లుగా పలు పురస్కారాలు కూడా అందుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో సవాంగ్ పని తీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల ఉద్యమం సందర్భంగా సీఎం జగన్ చెప్పిన ఆదేశాలను పోలీసులు పాటించలేదన్న అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా గంజాయి ఎక్కడ పట్టుబడినా ఏపీ పేరు వినిపించింది. ఏపీలోనే ఎందుకు పట్టుకోలేదన్న విమర్శలు వచ్చాయి. అలాగే పోలీసు ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలు కూడా సీఎం జగన్ కటువైన నిర్ణయం తీసుకోవడానికి కారణం అని అంచనా వేస్తున్నారు.
పోలీసులు, ఇంటలిజెన్స్ వైఫల్యంపై సీఎం జగన్ సీరియస్.. అరగంట పాటు వివరణ ఇచ్చిన డీజీపీ ?
ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డీజీపీగా సవాంగ్‌కు బాధ్యతలు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చాన్సిచ్చారు. అయితే ఇద్దరూ రిటైర్మెంట్ వరకూ తమప పదవుల్ని నిలుపుకోలేకపోయారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా రిటైర్ అయ్యే వరకూ సీఎస్ పదవిలో ఉండనీయలేదు. మధ్యలోనే బదిలీ చేశారు. ఇప్పుడు డీజీపీ సవాంగ్‌కూ అదే పరిస్థితి. ప్రాధాన్యం లేని పోస్టుకు అప్పటి సీఎస్ ఎల్వీని బదిలీ చేశారు. ఇప్పుడు సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎలాంటి పోస్టింగ్ ఇచ్చినా డీజీపీగా చేసిన సవాంగ్ కొత్త పోస్టులో కుదురుకోవడం కష్టమని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.