Chandrababu sensational comments on Tirumala Laddu controversy | అమరావతి: తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ చేసి ఘోరమైన అపచారం చేశారని గత వైసీపీ పాలకులపై ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ అధికారులు గుజరాత్ కు పంపిన నెయ్యి శాంపిల్స్ పరీక్షించగా ఆవు కాకుంగా ఇతర జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులో బహిర్గతమైంది. కూటమి ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రధాని మోదీ స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి తిరుమలపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ రాసిన లేఖలో కోరారు.


ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి వివాదంపై మరోసారి స్పందించారు. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అప్పుడే నామీద దాడి జరిగింది. అదొక మిరాకిల్. 24 క్లైమోర్ మైన్స్ తో దాడి జరిగితే సాక్షాత్తూ భగవంతుడే నన్ను కాపాడాడు. లేకపోతే బతికే అవకాశమే లేదు. దాన్ని నేను పునర్జన్మగా భావిస్తాను. అందుకే ఏ పనిచేసినా రెండు నిమిషాలు వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటాను. స్వామి వారితో ఇలాంటి అనుబంధం, భక్తి ఉన్న సమయంలో అపచారం జరిగింది. వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ సెటిల్ చేస్తాడు. వైఎస్సార్ హయాంలో 7 కొండలను 5 కొండలు అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ తరువాత నేను పాదయాత్ర చేశాను. 


వెంకటేశ్వరస్వామి అంటే ఓ అద్భుతం. తిరుమల వెళ్లి కొండెక్కితే ఓ గమ్మత్తు. మైమరచిపోతాం. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవకు వెళ్తే వైకుంఠం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తుంది. అలాంటి స్ఫూర్తిని ఇచ్చే పవిత్రమైన ప్రదేశం, క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రం తిరుమలలో గత ఐదేళ్లు రాజకీయాలకు పునరావాసం. భక్తుల మనోభావాలకు విలువ లేదు. ప్రసాదంలో, నాణ్యతలో ఎక్కడికక్కడా అపవిత్రం చేశారు. భక్తులు ఎన్నోసార్లు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రిగా కాదు, ఓ భక్తుడిగా చెబుతున్నాను. వెంకటేశ్వరస్వామి లడ్డూకు ప్రత్యేకత ఉంది. 300 ఏళ్ల నుంచి భక్తులు పవిత్రంగా స్వీకరిస్తున్నారు. నాణ్యతలేని సరుకులు ఎక్కడా వాడరు. ఇచ్చేవారు సైతం దేవుడికి అని పవిత్రమైన భక్తి భావనతో సరుకులు ఇస్తారు. మంచి వాసనతో లడ్డూనే కాదు జిలేబి, వడ, పొంగలి.. ఇలా దేనికదే ప్రత్యేకత ఉంటుంది.



తిరుమల కొండపై భోజనం చేస్తే ఓ మంచి అనుభూతి కలుగుతుంది. ఎలాంటి పదార్థాలు వాడతారు, హెలికాప్టర్ తో సీడ్ బాల్స్ వేపించాను. 9 ఏళ్లు ఎప్పుడు వెళ్లినా సమీక్షలు చేపించి వివరాలు సేకరించాను. రాందేవ్ బాబాతో తిరుపతి ఆయుర్వేదాన్ని లింక్ చేసి మెడిసిన్ ప్లాంటింగ్ చేశాం. వెంకటేశ్వరస్వామి వద్ద ఎటు చూసినా ఆ చెట్లతో పచ్చదనం, ఆధ్యాత్మిక ఉంటుంది. తిరుమల లడ్డూకు చాలా డిమాండ్.  155 గ్రాముల లడ్డూ తయారీకి 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, ఇతర పదార్థాలతో చేయగా సువాసన వస్తుంది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గా తిరుమల లడ్డూకు 2009లో పేటెంట్ పొందాం. ఇలాంటి పదార్థాన్ని మరెక్కడా ఉండదు. ఆ పవిత్రతను మనం కాపాడాలి.


అలాంటి తిరుమల శ్రీవారి వద్ద ఇష్టానుసారంగా ట్రస్ట్ బోర్డ్ నియామకం గ్యాంబ్లింగ్ గా మారింది. 50 వరకు నామినేషన్లకు వెళ్తే హైకోర్టులో స్టే వచ్చే పరిస్థితి. తిరుమల కొండపై వ్యాపారం చేశారు. స్వామివారి టికెట్లు ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం పోరాటం చేశారు. మేం వెళితే అలిపిరి వద్దే ఆపితే నిరసన తెలిపామని గుర్తు చేశారు. అన్యమతస్తులకు టీటీడీలో ప్రాధాన్యం ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ లుగా నియమించారు. రాజకీయ పలుకుబడికి టీటీడీలో వినియోగించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో కండీషన్ 18 పేరుతో 3 ఏళ్లు అనుభవం ఉండాలన్న దాన్ని 1 ఏడాదికి తగ్గించారు. డైరీ పెట్టిన ఏడాదిలోనే నెయ్యి సరఫరా చేపించారు. 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉంటే, ఎవరైనా సరఫరా చేసేలా మార్చేశారు. 8 టన్నుల మార్కెట్ లో ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉంటే దాన్ని తొలగించాలి. 12 టన్నుల ఉత్పత్తిని 8 టన్నులుగా మార్చారు. 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను ఏడాదికి తీసుకొచ్చారు. రూ.250 కోట్ల కనీసం టర్నోవర్ ఉండాలన్న రూల్ ను రూ.150 కోట్లకు తగ్గించారని’ సీఎం చంద్రబాబు వివరించారు. 


Also Read: Tirumala Laddu News: తప్పు చేస్తే రక్తం కక్కుకుని చావాలి - తిరుమల లడ్డూ వివాదంపై భూమన సంచలన వ్యాఖ్యలు