AP Cabinet Meet : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం అమరావతిలో జరగనుంది.  వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది.  ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది.  వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  21 నుంచి ఐదురోజులపాటు ఈ సమావేశాలు జరుగతాయి.  ఐదు రోజులుపాటే జరుగుతాయా మరికొన్ని రోజులు పొడిగించాలా అనేదానిపై కూడా కేబినెట్‌లో చర్చిస్తారు.  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.           


నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి.  అయిదు రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్‌ సర్కారు రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. 


మార్పుల అనంతరం వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ఏపీ సర్కారు ప్రవేశపెట్టనుంది. బిల్లులతో పాటు కీలకాంశాలపై ప్రస్తావన సభలో వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైఎస్సార్సీఎల్పీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.                            


సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో అపాయింట్ మెంట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  . ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంట్ సమవేశాలతో  బిజీగా ఉన్నారు. దీంతో ఇంకా అపాయింట్మెంట్లు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ... అపాయింట్ మెంట్లు దొరికితే వెళ్లి వచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.