AP Cabinet Meet : 12వ తేదీన బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.  అందరికీ  ఇళ్లు , అమరావతి ప్రాంతంలో ఇళ్ల  నిర్మాణానికి  సంబంధించి  కేబినెట్ లో చర్చిస్తారు.  అదే విధంగా ముఖ్యమంత్రి , మంత్రుల  జిల్లా పర్యటనలు పై   క్లారిటి వచ్చే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అమరావతి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాన్ని  సవాల్ గా తీసుకుంది. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్దలం కేటాయింపు,  ఆ తరువాత కూడ ఇంటి నిర్మణానికి అవసరం అయిన అన్ని సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇంటి స్దలాల కేటాయింపులకు సంబంధించిన వ్యవహరంలో  కోర్టులో ఇబ్బందులు లేకుండా.. తుది తీర్పును బట్టి లబ్దిదారులకు యాజమాన్య హక్కులు కల్పించే షరతుతో ముఖ్యమంత్రి రాజదాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్దలాన్ని కేటాయించారు. 


రాజధానిలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని టార్గెట్ 


ఇప్పుడు ఇంటి నిర్మాణం పై  ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నందున  రాజధాని ప్రాంతంలో పేదలకు సొంతింటి కల ను నెరవేర్చేందుకు అవసరం అయిన అన్ని సదుపాయాలు కల్పించి ఇంటి నిర్మాణాన్ని కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన  అంశాల పై జగన్ సర్కార్ క్లారిటి ఇచ్చింది. జీపీఎస్ అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీపీఎస్ కు బదులుగా దానికన్నా మెరుగయిన సదుపాయాలు కలిగిన జీపీఎస్ ను క్యాబినేట్ లో సర్కార్ ఆమోద ముద్ర వేసింది. 


పోలవరం అంశంపైనా  చర్చ


మంత్రి వర్గ సమావేశంలో ఇటీవల పోలవరం కు సంబంధించిన అంశాల పై   చర్చకు  వచ్చే అవకాశం ఉంది.  డయాఫ్రం వాల్ నిర్మాణం పై మెదలయిన వివాదం  కారణంగా అటు కేంద్రం  పోలవరం అంశాన్ని టేకప్ చేసింది. ఈ అంశం పై ఇప్పటికే  కేంద్ర, రాష్ట్ర స్దాయిలో అధికారుల సమావేశం  జరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణం దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రాజెక్ట్ భద్రతకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకునే విషయం క్యాబినేట్ సమావేశంలో మరో సారి చర్చకు రానుంది.


రాజకీయ అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ 


రాజకీయంగా పలు అంశాల పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తన  మంత్రివర్గ  సహచరులతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని  ఎలాంటి  చర్యలు తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించించిన వివరాలను ప్రచారం చేయటం, ప్రతిపక్షాలకు సంబందించిన విమర్శలను తిప్పికొట్టే అంశాల పై ఇప్పటికే క్యాబినేట్ మంత్రులకు క్లియర్ గాచెప్పారు. ఇక జిల్లాల వారీగా ముఖ్యమంత్రి పర్యటనలు, మంత్రుల సమావేశాలు, పార్టి నియోజకవర్గాల ఇంచార్జ్ లు, పర్యవేక్షుల పాత్ర పై కూడ చర్చిస్తారని  చెబుతున్నారు.