AP Cabinet Meeting | అమరావతి: ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు వెలగపూడి స‌చివాల‌యంలో సిఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఏపి క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. మొత్తం 65 అంశాలపై ఈ క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. పలు సంస్థలకు అమరావతి లో ఇచ్చే భూ కేటాయింపులపై నిర్ణయం తెసుకోబోతున్నారు.

Continues below advertisement

ప్రధాన ఎజెండా మాత్రం ఇదే

ఈ నెల 14,15 తేదిల్లో విశాఖ లో జ‌రిగే పెట్టుబ‌డుల స‌ద‌స్సు పై క్యాబినెట్ చర్చించనుంది. ఇప్ప‌టికే స‌ద‌స్సు ఏర్పాట్లు భాద్య‌తలు మంత్రులు..అధికారులకు అప్ప‌గించిన సిఎం డానికి సంబందించిన ఇతర వివరాలపై మంత్రుల తో మాట్లాడనున్నారు. అలాగే రాష్ట్రంలో రూ. ల‌క్ష కోట్లు పెట్టుబ‌డుల‌కు క్యాబినెట్ అమోదం తెల‌ప‌నున్నట్టు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పలుమార్లు విదేశాల్లో పర్యటన చేసి వచ్చారు. అక్కడ ఉన్న వేత్తలు పారిశ్రామిక వేత్తలను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారిలో కొంతమంది ఈ నెల 14 15 తారీకుల్లో వైజాగ్ లో జరిగే  పార్ట్నర్షిప్ సమిట్కి అటెండ్ కాబోతున్నారు కూడా. ఈ సమితిని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

Continues below advertisement

ఈ సదస్సులో  ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ సైతం తొలిసారి పాల్గొంటున్నారు. కాబట్టి ఆయన తన వంతు సూచనలు సలహాలు  క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారు. వీటితోపాటుగా  ఇటీవల తీర ప్రాంతంలో మొంథా తుఫాన్ చూపిన ప్ర‌భావం చేసిన న‌ష్టం అంచ‌నాలు బాదితులకు అందించే ప‌రిహారం పై చ‌ర్చ‌ జరగబోతోంది.అలాగే సిఆర్డీఏ ki రాజధాని నిర్మాణం కోసం NaBFID నుంచి రూ.7500 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమ‌తి ఇవ్వనుంది క్యాబినెట్. వీటితో పాటు పలు  సంస్థ‌ల‌కు ఏపీలో భూ కేటాయింపుల‌కు అమోదం  ఇవ్వబోతోంది ఏపీ మంత్రి వర్గం.

కొత్త జిల్లాలపై మరోసారి చర్చపాలనా సౌలభ్యం కోసం మరోసారి జిల్లాల ను కొంత మేర మార్చనున్నారు. కొన్నిచోట్ల జిల్లాల్లో మండలాలు మార్పు చేస్తే  కనీసం రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఆయా నూతన జిల్లాలు,రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు పై కీలక నిర్ణయం ఈరోజు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల మేరకు జిల్లాల విభజన చేసే అవకాశం ఉంది.ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో  దీనిపై నిర్ణయం తీసుకోగా సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజన పై క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఎలా చూసినా ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్ చాలా కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.