BJP Vishnu దేశం కోసం ప్రాణాలర్పించిన అన్నమయ్య జిల్లా తెలుగు జాతి ముద్దు బిడ్డ  రాజశేఖర్ కు  రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గావ్ వద్ద సైనికుల బస్సు నదిలో పడిపోయిన దుర్ఘటనలో మృతి చెందిన ఐటీబీపీ జవాన్ రాజశేఖర్  మరణం తెలుగు జాతికి తీరని లోటన్నారు.  దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడి కుంటుంబానికి భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ తమ వంతు సహకారం అందిస్తుందన్నారు.  


వీరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు  నేడు దేశం కోసం ప్రాణాలర్పించిన అనేకమంది సరసన చేరిన తెలుగు తేజానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి సైన్యంలో చేరి దేశసేవ కోసం పని చేసే టువంటి యువత సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతుందని  రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో ఆలోచించి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. 



12 ఏళ్లుగా ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ గా రాజ‌శేఖ‌ర్ విధులు నివర్తిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ చ‌నిపోవ‌డంతో వారి ఇంట విషాదం నెల‌కొంది. అత‌నికి 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్య ప్రమీల, పెద్ద కుమార్తె (11), కుమారుడు మోక్షిత్ ( 8) ఏడాది చిన్న కుమార్తె హిమశ్రీ ఉన్నారు.  ఆ కుటుంబానికి ఉన్న ఆధారం కోల్పోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. మృతుడి తల్లి రాములమ్మ, తండ్రి చెన్నయ్య, తమ్ముడు సురేష్ ఉన్నారు. త‌మ్ముడు డిగ్రీ వరకు చదువుకుని ఇంటి వద్ద ఉంటున్నాడు. బ‌తుకుతెరువు కోసం ఉద్యోగం రాక కువైట్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు


అమ‌ర జ‌వాన్ రాజ‌శేఖ‌ర్‌ చెల్లెలు లావణ్య వివాహం అయినట్లు బంధువులు తెలిపారు. ఉమ్మడి కుటుంబం ఉన్న వీరికి ఎంతో కొండంత అండగా ఉన్న రాజశేఖర్ ఒకసారిగా లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామం రానున్నట్లు తెలుస్తోంది. అధికారిక లాంఛ‌నాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ... ప్రభుత్వం రూ. యాభై లక్షల సాయం అందించాలని విష్ణువర్దన్ రెడ్డి కోరుతున్నారు. గతంలో ఏపీకి చెందిన పలువురు జవాన్లు ఇలా విది నిర్వహణలో ప్రాణత్యాగం చేసినప్పుడు ఏపీ ప్రభుత్వం రూ. 30 నుంచి యాభై లక్షల వరకూ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే  ప్రస్తుతం అమరజవాన్ రాజశేఖర్‌కు రూ. ఐదు లక్షలు మాత్రమే ప్రకటించారు. ఇది ఆ కుటుంబసభ్యులు.. ముగ్గురు చిన్న పిల్లలకు ఏ మాత్రం సరిపోదని మరింత సాయం పెంచాలని బీజేపీ విజ్ఞప్తి చేస్తోంది.