BJP Saval To Ysrcp :    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై ఏపీ బీజేపీ విమర్శలు గుప్పించింది. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి  వైజాగ్ లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని నిర్వహించారని స్పష్టం చేశారు.  ఇది మంచి పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన పెట్టబడుల సదస్సులపై వైఎస్ఆర్‌సీపీ  నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు.  ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పెట్టుబడులకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.                                     


ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరును విష్ణువర్థన్ రెడ్డి తప్పు పట్టారు.  . ఈ నెల 13వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికలలో కూడా ఓటర్లను కోనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం అన్నారు. అధికారుల్ని ప్రభావితం చేసి.. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని.. కొన్ని చోట్ల బెదిరంపులకు పాల్పడుతున్నరని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీలు .. ఉపాధ్యాయ సంఘాల్లోని వారే గట్టిగా పోరాడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ కూడా అభ్యర్థుల్ని నిలబెట్టింది. పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా అన్ని పార్టీల తరపున అభ్యర్థులు నిలబడ్డారు. రాయలసీమలో అభ్యర్థుల విజయానికి బీజేపీ నేతలంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు. 


ఎన్నికల విషయంలో అధికార తరపున అధికారులు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి  కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై విమర్శలు గుప్పించారు.  ఎన్నికల సంఘం ఈ అంశం పై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈనెల 13న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ విజయం సాధిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.                 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించలేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చింది. ఈ అంశంపై విష్ణువర్ధన్ రెడ్డి స్పంిదంచారు.  జనసేన,బిజేపి మధ్య పొత్తు కొనసాగుతుంది. కొన్ని పార్టీలు మాత్రం విడిపోవాలని కోరుకుంటున్నాయన్నారు వారి కోర్కేలు తీరవని స్పష్టం చేశారు.                                                           


గుంటూరు టు రాప్తాడు - రోడ్డు మీదకు టీడీపీ- వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వార్ !