AP BJP Vishnu :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ సమస్యల్లో ఇరుక్కున్నారు. ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. తమ పార్టీ కార్యక్రమంలో భాగంగా గడప గడపకూ వెళ్లారు. అలా బుధవారం రాత్రి నెల్లూరు నగరంలో ఖుద్దూస్ నగర్ లో పర్యటించారు. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటంతో ముస్లిం టోపీ ధరించడమే కాకుండా.. వారితో పాటు ప్రార్థనల్లోనూ పాల్గొన్నారు. ఈ ఫోటోలను ఆయనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికే వైరల్ అయింది. 


అయ్యప్ప దీక్షలో ఉండి ఇతర మత ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి అనిల్ ఫోటోలు వైరల్ 




ఆయన ముస్లిం మత పెద్దలతో కలిసి కూర్చుని ప్రార్థన చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.


 


మంత్రి అనిల్ క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ 


భారతీయ జనతా పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ తీరుపై మండిపడ్డారు.  హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్ప మాలదీ క్షను అవమానపరిచిన మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  అయ్యప్ప దీక్షాపరులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసిపి నేత బరితెగించడం సిగ్గుచేటు.ఇలాంటివి హిందూ సమాజం క్షమించదని బీజేపీ హెచ్చరిస్తుందని ఆయన ప్రకటించారు. 





మంత్రి పదవి పోయిన తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన అనిల్  


అనిల్ కుమార్ ను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.  ఆయనకు ప్రాంతీయ సమన్వయకర్తగా రెండు జిల్లాల బాధ్యతలు ఇచ్చినప్పటికీ..సరిగ్గా పని చేయడం లేదన్న కారణంగా హైకమాండ్ తొలగించింది. నియోజకవర్గంలో  గడ్డు పరిస్థితులు ఉండటంతో ఆయన  గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రతీ రోజూ నిర్వహిస్తున్నారు. .  అయ్యప్ప భక్తుడైన ఆయన..   ఈ సారి కూడా దీక్ష తీసుకున్నారు. అయితే  దీక్షాధారణలో ఉండి చేయకూడదని కొన్ని పనులు చేయడం ద్వారా వివాదాల్లోకి ఎక్కారు. ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియాలో కూడా అనిల్ కుమార్ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలపై అనిల్ కుమార్ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.