AP BJP Chief Somu Verraju Sensational Comments Over Stone Pelting in Nellore District 


నెల్లూరులో ఇటీవల జరిగిన హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఏపీ ప్రభుత్వం అండతోనే  హిందువుల ర్యాలీపై రాళ్ల దాడులు జరిగాయని ఏపీ బీజేపీ అధ్యక్షు సోము వీర్రాజు ఆరోపించారు. కడపలో బీజేపీ కార్యాలయం నిర్మాణానికి సోము వీర్రాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ..  ఆంధ్రప్రదేశ్‌లో వైసీపి ప్రభుత్వం ప్రతిరోజు ప్రజలను ఇబ్బందిపెడుతూ నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ విషయాలను భారతీయ జనతా పార్టీ గమనిస్తోందని గుర్తుంచుకోవాలన్నారు. 


రాష్ట్రంలో కొంతకాలం నుంచి అనేక ప్రాంతాల్లో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా, రాష్ట్రం ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందువల్ల నేరస్తులకు భయంలేని పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గత కొన్ని రోజులుగా మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని, ఈ సంఘటనలపై మహిళా మోర్చా  రాష్ట్రవ్యాప్తంగా  ఉద్యమాలు చేస్తుందన్నారు. ఉద్యమాలు చేస్తున్న మహిళా మోర్చా కార్యకర్తలను ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయడం నిజం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మీ అసమర్ధ పాలన కారణంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పక్రారం రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుండి మహిళలపై దౌర్జన్యాలు పెరుగుతూనే ఉన్నా యి. 2021లో ఆంధప్రద్రేశ్ లో మహిళల పైజరిగిన అమానుష సంఘటనలు 17,736 ఈ సంఖ్య మీకు కనిపిస్తుందా? అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.


ఉద్యమకారుల పట్ల క్రూరంగా వ్యవహరించడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుంది. వైసీపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను బీజేపీ ఎండగడుతుంది. వైసీపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు బీజేపీ నేతలు పలు సందర్భాలలో అడ్డుకట్ట వేశారని గుర్తుచేశారు. కర్నూలు జిల్లా  ఆత్మకూరు సంఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి విషయంలో వైసీపి ఎమ్మెల్యే చక్రపాణి చేస్తున్న దాష్టికాలకు అడ్డుకట్ట వేశామని, ఎమ్మెల్యే  హిందూ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటున్నారని.. తమ పార్టీ అన్ని నోట్ చేస్తుందన్నారు.






సర్కార్ అండతోనే ర్యాలీపై రాళ్లదాడి
నెల్లూరులో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీ విషయంలోనూ రాష్ట్రం ప్రభుత్వం అండ చూసుకుని హిందువులు నిర్వహించిన ర్యాలీపై ముష్కరలు  రాళ్ళదాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు సోము వీర్రాజు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టు ల విషయంలో బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. 1972 సంవత్సరం నుండి ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టారని తమ పార్టీ చేస్తున్న ఉద్యమం ద్వారా సమస్య వెలుగుచూసిందని చెప్పారు. ఏపీలో సమస్యలపై బీజేవైఎం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తుందన్నారు.


కడపలో బీజేపీ కార్యాలయం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షుడు  యల్లారెడ్డి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బిల్డింగ్ కమిటీ చైర్మన్ సైదారెడ్డి, జిల్లా ఇంఛార్జి అంకాలరెడ్డి, నల్లబోతు వెంకట్రావు, రామక్రిష్టారెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, బాలక్రిష్ణ యాదవ్, హరిక్రిష్ణ, ఎన్ దుర్గా ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Also Read: Anakapalli Girl Rape: అనకాపల్లిలో 6ఏళ్ల బాలికపై రేప్, తానేటి వనిత ఫోన్ - అధికారులకు కీలక ఆదేశాలు  


ఏపీ, తెలంగాణలో మరిన్ని లేటెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి