AP Assembly thanks Centre for reducing GST:ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం జరిగిన GST సంస్కరణలపై  స్వల్ప కాలిక చర్చ జరిగింది.   GST కౌన్సిల్ ఆమోదించిన కొత్త స్లాబ్‌లు ప్రజలకు వార్షికంగా రూ.8,000 కోట్ల లాభం చేకూర్చుతాయని అంచనా వేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పత్తులపై GST స్లాబ్‌లను 5% నుంచి 18% వరకు తగ్గించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది.  అసెంబ్లీలో GST సంస్కరణలకు మద్దతు తెలపడానికి తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చలో శాసనసభ్యులు పాల్గొన్నారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.                   

 GST సంస్కరణలు ప్రజలకు ప్రత్యేక ఉపశమనం అని సీఎం చంద్రబాబు అన్నారు. పేదలు, కార్మికులు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మేలు చేస్తుందన్నారు.  రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులపై GST తగ్గడంతో రైతులు రూ.2,000 కోట్ల చొప్పున లాభపడతారు. మా ప్రభుత్వం ఈ సంస్కరణల అమలుకు పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో GST సంస్కరణలను 'దీపావళి బహుమతి'గా వ్యాఖ్యానించారు.  "ఈ మార్పులు ప్రతి కుటుంబానికి ఉపశమనం. ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలపై GST తగ్గడంతో పేదలకు ఖర్చులు మిగులుతాయన్నారు.  రాష్ట్రంలో రైతులు, చిన్న వ్యాపారులు ఈ లాభాన్ని పొందాలంటే, మా ప్రభుత్వం స్థానిక స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పవన్ ప్రకటించారు. 

చర్చ ముగిసిన తర్వాత, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో GST సంస్కరణలకు పూర్తి మద్దతు తెలపడం, రాష్ట్రంలో అమలుకు అవసరమైన అందరు చర్యలు తీసుకోవడం, ప్రజలకు లాభాలు చేరేలా ప్రచారం చేయడం వంటి పాయింట్లు చేర్చారు. "ఈ సంస్కరణలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ,  పేదలకు నిజమైన ఉపశమనం అందిస్తాయి" అని తీర్మానంలో పేర్కొన్నారు. తీర్మానాన్ని ఆమోదించడంపై నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.                

వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంతో వారు తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు.అలాగని వ్యతిరేకించలేదు.