వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు ఉమాశంకర్ రెడ్డి అనే మరో నిందితుడ్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సునీల్ కుమార్ యాదవ్‌ను తొలి నిందితునిగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డి అరెస్టుతో ఇద్దర్ని నిందితులుగా తేల్చినట్లయింది. ఉమాశంకర్ రెడ్డి సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామంలో నివహిస్తూ ఉంటారు. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి. సునీల్ యాదవ్‌తో స్నేహంగా ఉంటారని భావిస్తున్నారు. ఉమాశంకర్ రెడ్డిని చాలా రోజులుగా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించగానే ఈ రోజు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. Also Read : మటన్ దుకాణాలు పెడుతున్న ఏపీ ప్రభుత్వం
వివేకా హత్య కేసు దర్యాప్తును గత మూడు నెలలుగా సీబీఐ అధికారులు నిర్వహిస్తున్నారు. అనేక మంది అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసినప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు. సునీల్ చెప్పిన వివరాల ప్రకారం ఆయుధాల కోసం అన్వేషించారు. అయితే దొరికాయో లేదో స్పష్టత లేదు. కానీ ఆ ఆయుధాలు అమ్మినట్లుగా భావిస్తున్న వ్యాపారిని సీబీఐ అధికారులు గుర్తించారు. అతను కదిరి పట్టణానికి కృష్ణమాచారి. అతని దుకాణంలోనే వివేకానందరెడ్డి హత్యకు వాడిన ఆయుధాలను కృష్ణమాచారి దుకాణంలోనే కొనుగోలు చేశారన్న అనుమానాలున్నాయి.Also Read : ఏపీకి భారీగా నిధులిచ్చిన కేంద్రం
ఇప్పటికి ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ముగ్గురు వాంగ్మూలాలు నమోదు చేశారు. వాచ్‌మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిలతో పాటు కృష్ణమాచారి వాంగ్మూలాలు కూడా నమోదు చేయించారు. కృష్ణమాచారిని గతంలో కూడా సీబీఐ అధికారులు చాలా సార్లు పిలిచి ప్రశ్నించారు. సీబీఐ అధికారులు పులివెందులలో విచారణ ప్రారంభించి మూడు నెలలు అవుతోంది. కడప జైలు గెస్ట్ హౌస్, పులివెందుల గెస్ హౌస్‌లోనే వారి మకాం కొనసాగుతోంది. ప్రశ్నించిన వారినే ప్రశ్నిస్తున్నారు. ఒక్క సునీల్ యాదవ్ ను మాత్రం అరెస్ట్ చేశారు. ఆయనకు నార్కో టెస్ట్ చేద్దామనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. కోర్టు సీబీఐ పిటిషన్‌ను తిరస్కరించింది. Also Read : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని లోకేష్‌ను నర్సరావుపేట వెళ్లకుండా ఆపిన పోలీసులు
వివేకా హత్యకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం చెబితే రూ. ఐదు లక్షలు ఇస్తామని పేపర్లలో సీబీఐ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఎవరైనా ఏదైనా సమాచారం ఇచ్చారో లేదో తెలియదు కానీ ఇటీవలి కాలంలో వైఎస్ వివేకా కుటుంబసభ్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. వైఎస్ జగన్ మేనమాన రవీంద్రనాథ్ రెడ్డి మూడు రోజుల కిందట సీబీఐ ఎదుట హాజరయ్యారు. కేసును త్వరగా తేల్చాలని కోరినట్లుగా ఆయన మీడియాకు చెప్పారు.
Also Read : టిక్కెట్ నిర్ణయాలపై నోరెత్తని టాలీవుడ్ పెద్దలు