Additional Responsibilities to Indrakeeladri EO: విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు శ్రీకాళహస్తి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే బదిలీ అయిన ఆజాద్‌ ను దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలిచ్చింది. అన్నవరం దేవస్థానంలో ఈవోగా పని చేసిన ఆజాద్ ను తొలుత శ్రీకాళహస్తి ఈవోగా నియమిస్తూ ఆదేశాలివ్వగా, ఆయనపై పలు ఆరోపణల నేపథ్యంలో ఆ ఉత్తర్వులు వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ కు అన్నవరం అదనపు బాధ్యతలు అప్పగించారు.


కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1న దుర్గగుడి ఈవో భ్రమరాంబను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం.శ్రీనివాస్ ను ఈవోగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే, ఆయన విధుల్లో చేరకపోవడంతో శ్రీకాళహస్తీ ఆర్డీవోగా పని చేస్తోన్న కేఎస్ రామారావును దుర్గగుడి నూతన ఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు సైతం అప్పగించింది.


Also Read: Andhra News : ఏపీలోనూ జనసేన, బీజేపీ కలిసే వెళ్తాయి - పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు !