ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 56,463 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 809 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,51,133 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 10 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,186కు చేరింది. తాజాగా 1,160 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,25,805కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 11,142 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,83,50,167 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనాతో గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతిచెందారు. 







తెలంగాణలో కొత్త కేసులు


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 46,193 నమూనాలను పరీక్షించగా 220 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,66,183కు చేరింది.  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,919కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 244 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,57,665కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,599 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.


దేశంలో కొత్త కేసులు


దేశవ్యాప్తంగా కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం 18 వేలలో నమోదైన కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా దేశంలో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 26,727 మందికి కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది. మొత్తం 15.20 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైందని ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న నమోదైన కోవిడ్ కేసులతో (23,529) పోల్చితే ఈరోజు 3 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.


Watch : కొవిడ్ ఆంక్షలతో పోలేరమ్మ జాతర.. దర్శనాలకు అనుమతి ఇవ్వకపోవడంపై భక్తుల ఆగ్రహం


2 లక్షల 75 వేల యాక్టివ్ కేసులు


ఇక నిన్న ఒక్క రోజే 28,246 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,30,43,144కి పెరిగింది. 277 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,48,339కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,75,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 3,37,66,707 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు మొత్తం 89,02,08,007 మందికి కోవిడ్ టీకాలు అందించారు. నిన్న ఒక్క రోజే 64,40,451 మందికి వ్యాక్సిన్లు వేశారు. 


Also Read: బూస్టర్ డోసుపై ఏ నిర్ణయం తీసుకోలేదు.. యువతకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం... స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి