News SPs appointed for Palnadu Tirupati Anantapur districts | అమరావతి: ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఇటీవల ఈసీ తొలగించిన మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం జరిగింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్,  తిరుపతి జిల్లా ఎస్పీగా, హర్షవర్దన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించారు. ఇటీవల ఎన్నికల రోజు, అనంతరం హింస చెలరేగిన కారణంగా ఎలక్షన్ కమిషన్ మూడు జిల్లాల ఎస్పీలపై చర్యలు తీసుకోవడం తెలిసిందే. 

Continues below advertisement




Tirupati SP Harshavardham Raju


పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India). ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల రోజు, అనంతరం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింసపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించి వారి వివరణ తీసుకుంది. అనంతరం పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసింది ఈసీ. వారిని విధుల నుంచి తప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఈసీ ఆదేశించడం తెలిసిందే. అదే విధంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌ను, తిరుపతి ఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. తాజాగా పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్, ఎస్పీలను ఈసీ నియమించింది. తిరుపతి, అనంతపురం జిల్లాలకు సైతం ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.