Telugu News Today: 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో జరిగినవి ఒక ఎత్తు అయితే... ఆంధ్రప్రదేశ్‌లో జరిగినవి మరో ఎత్తు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోలింగ్, చివరకు కౌంటింగ్ వరకు అత్యంత నాటకీయ పరిణామాలు జరిగాయి. లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి జెండా ఎగిరింది. 25 ఎంపీ స్థానాలకు అర్థరాత్రి వరకు జరిగిన లెక్కింపులో  కూటమి పార్టీలు 21 స్థానాలు గెలుచుకోగా వైసీపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి నాలుగుకు పరిమితం అయ్యింది. కూటమిలో టీడీపీ 16 చోట్ల విజయం సాధించగా.... జనసేన రెండు సీట్లలో జయకేతనం ఎగరేశారు. బీజేపీ ఆరు స్థానాలకు మూడు చోట్లే విజయం సాధించింది. 
కూటమిగా కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 17 చోట్ల పోటీ చేసి 16 స్థానాలు కైవశం చేసుకుంది. జనసేన రెండింటింకి రెండును గెలుచుకుంది. ఒక్క బీజేపీ మాత్రం మూడు స్థానాలు కోల్పోయింది.  మూడింటిలో మాత్రమే నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో బీజేపీ తర్వాత ఎక్కువ స్థానాలు నెగ్గిన పార్టీగా టీడీపీ ఉంది. 

జనసేన అసెంబ్లీ సీట్లలోనే కాదు లోక్‌సభ సీట్లలో కూడా వందకు వంద శాతం ఫలితాలు సాధించింది. కూటమితో పోటీ చేసిన జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. అన్నింటిలో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. పదే పదే పవన్ చెప్పినట్టు ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదని... తీసుకున్న వాటిలో ఎన్ని గెలుచుకున్నామనేది ముఖ్యమని చెబుతూ వచ్చారు. ఆయన పిలుపు మేరకు జనసైనికులు తీసుకున్న అన్ని సీట్లలో విజయం కట్టబెట్టారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన కాకినాడ, మచిలీపట్నం లోక్ స్థాల్లో విజయం సాధించింది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్‌ గెలుపొందారు. 

టీడీపీ ఈసారి 17 లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేసింది. అందులో 16 స్థానాలు గెలుచుకుంది. ఒక్క కడప సీటులోనే ఓడిపోయింది. ఇక్కడ కూడా గట్టి పోటీని ఇచ్చింది. 

 

  నియోజకవర్గం  విజేత   మెజార్టీ  పార్టీ  ప్రత్యర్థి
1 అరకు  చెట్టి తనూజ రాణి 50,580 వైసీపీ కొత్తపల్లి గీత
2 శ్రీకాకుళం   కింజరాపు రామ్మోహన్‌ నాయుడు 3,27,901  టీడీపీ పేరాడ తిలక్‌
3 విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు 2,38,216  టీడీపీ బెల్లాన చంద్రశేఖర్‌
4 విశాఖ  మతుకుమిల్లి భరత్ 5,04,247 టీడీపీ బొత్స ఝాన్సీ
5 అనకాపల్లి  సీఎం రమేష్ 2,96,530  బీజేపీ బూడి ముత్యాల నాయుడు
6 కాకినాడ  తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ 2,29,491 జనసేన చెలమలశెట్టి సునీల్‌
7 అమలాపురం గంటి హరీష్ 3,42,196 టీడీపీ రాపాక వరప్రసాద్‌
8 రాజమండ్రి  పురందేశ్వరి 2,39,139 బీజేపీ డా. గూడురి శ్రీనివాసులు
9 నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస వర్మ 2,76,802 బీజేపీ గూడూరి ఉమా బాల
10 ఏలూరు పుట్టా మహేశ్‌ యాదవ్ 1,78,326 టీడీపీ కారుమూరి సునీల్‌ కుమార్‌
11 మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి 2,23,179 జనసేన సింహాద్రి చంద్రశేఖర్‌ రావు
12 విజయవాడ  కేసినేని చిన్ని  2,82,082 టీడీపీ కేసినేని నాని 
13 గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్‌ 3,44,695 టీడీపీ కిలారి వెంకట రోశయ్య
14 నరసరావుపేట  లావు కృష్ణదేవరాయులు 1,59,729 టీడీపీ అనిల్‌ కుమార్ యాదవ్
15 బాపట్ల  టి.కృష్ణ ప్రసాద్ 2,02,941 టీడీపీ నందిగాం సురేష్‌ బాబు
16 ఒంగోలు  మాగుంట శ్రీనివాసులురెడ్డి 48,911 టీడీపీ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
17 నంద్యాల  శబరి(టీడీపీ) 1,36,278 టీడీపీ పోచా బ్రహ్మానందరెడ్డి
18 కర్నూలు  బస్తిపాటి నాగరాజు 1,11,298 టీడీపీ బివై రామయ్య
19 అనంతపురం  అంబికా లక్ష్మీనారాయణ 1,08,293 టీడీపీ మాలగుండ్ల శంకర నారాయణ
20 హిందూపురం  బీకే పార్థ సారథి 1,25,607 టీడీపీ జోలదరసి శాంత
21 కడప  అవినాష్‌ రెడ్డి 65,490 వైసీపీ  షర్మిల
22 నెల్లూరు  వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి  2,45,902 టీడీపీ విజయసాయిరెడ్డి 
23 తిరుపతి  మద్దిల గురుమూర్తి 14,569 వైసీపీ  వరప్రసాద్‌(బీజేపీ)
24 రాజంపేట  మిథున్ రెడ్డి 76,071 వైసీపీ  కిరణ్ కుమార్ రెడ్డి
25 చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాదరావు 2,20,479 టీడీపీ ఎన్‌ రెడ్డప్ప