ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,601 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 1,597 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 8 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,672కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 8,766 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,27,985 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 62,395 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,05,052కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8,766 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 62,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,672కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,26,79,288 నిర్థారణ పరీక్షలు చేశారు.
తెలంగాణలో కొత్తగా 1380 కరోనా కేసులు
తెలంగాణలో కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 68,720 శాంపిల్స్ పరీక్షించారు. వీటిల్లో కొత్తగా 1,380 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు ప్రాణం కోల్పోయారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కోవిడ్ బులెటిన్ ప్రకారం... నిన్న ఒక్కరోజు 3,877 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 24 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా పాజిటివ్ కేసులు లక్ష దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83,876 (83 వేల 876) మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ 895 మంది మరణించారు. వరుసగా అయిదోరోజులు కరోనా మరణాలు వెయ్యి పైగా నమోదు కాగా, తాజాగా మరణాలు వెయ్యి దిగువకు వచ్చాయి. తాజా మరణాలతో కలిపితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 5,02,874 (5 లక్షల 2 వేల 874)కు చేరింది. నిన్న ఒక్కరోజులో 1,99,054 (1 లక్షా 99 వేల 54) మంది కరోనాను జయించారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తాజా రికవరీలతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 11,08,938 (11 లక్షల 8 వేల 938) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు రేటు 7.25కి దిగొచ్చింది.