Andhra Pradesh cabinet decisions: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సుమారు 70 అజెండా అంశాలపై విస్తృత చర్చ జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం మూడున్నర గంటలపాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై విస్తృత చర్చ జరిగింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపు, పరిశ్రమల స్థాపనలో భూ కేటాయింపుకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ వంటి కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొంధా తుఫాను సమయంలో మంత్రులు, అధికారుల చొరవలను సీఎం అభినందించారు.
మొంథా తుపాను సమయంలో కష్టపడి పని చేసిన మంత్రులు
సమావేశంలో అజెండాలపై చర్చించిన తర్వాత, వివిధ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. మొంధా తుఫాను సమయంలో ప్రతి మంత్రి క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సహాయం అందించారని, అధికారులతో సమన్వయంతో చర్యలు వేగంగా అమలు చేశారని సీఎం ప్రశంసించారు. ఆర్‌టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలిగామని చెప్పారు. "సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అందరూ కలిసి కష్టపడి పనిచేశారు, స్వయంగా చూశాను" అంటూ మంత్రులను అభినందించారు.
ఏపీ నైబర్ హుడ్ పాలసీకి ఆమోదం - క్వాంటం కంప్యూటింగ్ పాలసీకి ఓకే రాజధాని అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడానికి సహాయపడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. క్యాపిటల్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అలాగే ఏఐపీబీ సమావేశంలో ఆమోదించిన రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్.. విశాఖలో ఐటీ కంపెనీలకు రోడ్డు విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు.
విశాఖలో కొన్ని సంస్థలకు భూముల కేటాయింపు
విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ఐటీ క్యాంపస్‌కు 2 ఎకరాల కేటాయించారు. ఫ్లూయెంట్‌గ్రిడ్ ఐటీ క్యాంపస్‌కు 3.3 ఎకరాలు కేటాయించారు. రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం. సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, పేదలందరికీ ఇళ్లు కేటాయించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. "నివాస స్థలం లేని ప్రతి కుటుంబానికి ఇల్లు దక్కేలా జాబితా రూపొందించండి. ప్రభుత్వ చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోండి" అని చెప్పారు.రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. "త్వరత్గతిన సమస్యలు పరిష్కరించే సరైన విధానాలు రూపొందించాలి. రైతులు, పౌరుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి" అని ఆదేశించారు. మొంధా తుఫాను సమయంలో మంత్రులు, అధికారుల సమన్వయం ద్వారా ప్రాణ నష్టాలు తగ్గాయని, ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కొనసాగాలని సూచించారు.