IND vs SA Test Series Date and Time: దక్షిణాఫ్రికా జట్టు భారతదేశ పర్యటనకు వస్తోంది. ఈ టూర్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నారు. దక్షిణాఫ్రికా, భారత్ సిరీస్ శుక్రవారం, నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ 14న ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రానున్నాడు. అంతకుముందు పంత్‌ను దక్షిణాఫ్రికా Aతో జరిగిన మ్యాచ్‌లో భారత్ A జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. పంత్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టం కానుంది.

Continues below advertisement


భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్


భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 14న ప్రారంభమై నవంబర్ 26 వరకు జరుగుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, రెండో మ్యాచ్ గౌహతిలో జరగనుంది.



  • భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

  • ఈ టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 


వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనున్న టీమిండియా 


భారత్, దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తయ్యాక మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కూడా జరుగుతాయి. 



  • వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

  • రెండో వన్డే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.

  • ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు ఏపీ ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ సైతం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.


భారత్ , దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్



  • మొదటి టీ20- డిసెంబర్ 9, కటక్

  • రెండో టీ20- డిసెంబర్ 11, న్యూ చండీగఢ్

  • మూడో టీ20- డిసెంబర్ 14, ధర్మశాల

  • నాల్గవ టీ20- డిసెంబర్ 17, లక్నో

  • ఐదవ టీ20- డిసెంబర్ 19, అహ్మదాబాద్