Andhra Pradesh Cabinet :  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారికి ఇప్పటి వరకూ ఉన్న అతి పెద్ద అడ్డంకిని చంద్రబాబు ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించుకుంది.  ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసే అంశంపై క్యాబినెట్ లో చర్చించారు.  జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి గత నిబంధనలను రద్దు చేయాలని నిర్ణయించారు.  మునిసిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమవేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించనున్నారు. 


నూతన మద్యం పాలసీపై కేబినెట్‌లో చర్చ                


మద్యం నూతన విధానం తెచ్చే విషయంలో ప్రతిపాదనలపై  కేబినెట్ చర్చించింది.  మద్యం నూతన విధానం ఆదాయ ఆర్జన కోణంలో కాకుండా...అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేలా తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం  ఉంది.  2014 -19, 2019-24 మధ్య కాలంలో వచ్చిన ఎక్సైజ్ పాలసీలు చర్చించించారు. అలాగే  బొమ్మల పిచ్చితో జగన్ రూ. 700 కోట్లు తగలేశారని మంత్రులు పలువురు సీఎం దృష్టికి తీసుకెిళ్లారు.  సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించడానికి కెబినెట్ ఆమోదం తెలిపింది.  రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.  జగన్ బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కు తీసుకుని కొత్త పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు.


అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవా ?


భూముల రీసర్వేను అబయెన్స్‌లో పెట్టాలని నిర్ణయం                             


అలాగే భూముల రీ సర్వేపై  కెబినెట్లో నోట్ సమర్పించింది రెవిన్యూ శాఖ.  రీ-సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై మంత్రులు చర్చించారు.  గత ప్రభుత్వ విధానం వల్ల రీ-సర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందని మంత్రులు అభిప్రాయపడటంతో  రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయం తీసుకుంది.  మావోయిస్టులపై ఇప్పటికే ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవోను మంత్రివర్గం రద్దు చేసింది.  


ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ - కేటీఆర్ పంతం నెరవేరుతుందా ?


త్వరలో రెవిన్యూ, గ్రామ సభల నిర్వహణ                                             


పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217,144 జీఓలు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు ప్రారంభించనున్నారు.  గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.  త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.   మూడు నెలల పాటు వివాాదాస్పద రిజిస్ట్రేషన్లు, 22A వివాదాలపై  పరిశీలన చేయనున్నారు.