ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై ఇంటర్మీడియట్ బోర్డు మండిపడింది. 2021–22 విద్యా సంవత్సరానికి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని  ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్‌లైన్ విధానం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 


ఇంటర్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల అవ్వకుండానే, ఆన్‌లైన్‌ అడ్మిషన్లు ఇంకా మొదలుపెట్టకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కళాశాలల్లో అడ్మిషన్లు పొందారని, ఫీజులు కూడా చెల్లించారని తమకు సమాచారం వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను సదరు కాలేజీలు తక్షణమే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్‌ఐవోలు వెంటనే గుర్తించి, గుర్తింపు రద్దు చేయాలని, అలాగే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న ప్రైవేట్ కళాశాల విషయంలో సైతం కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. కరోనా కష్టకాలంలో స్టడీ మెటిరియల్, యూనిఫారాలు తప్పక కొనుగోలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీ యాజమాన్యాలపై ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలలు ఒత్తిడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు, విద్యార్థులు నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని తెలిపింది. ఫీజుల  విషయంలో ఒత్తిడి చేస్తున్న కళాశాలలపై మొయిల్‌, వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఇంటర్ బోర్డు తెలిపింది. ourbiep@gmail.com ఈమెయిల్ లేదా 9393282578 నంబర్‌కు వాట్సాప్‌ లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.


జూనియర్ కాలేజీలు దూకుడుకు ఇంటర్ బోర్డు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టంది.  ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ లేకుండా కొన్ని  కాలేజీలు అడ్మిషన్లు చేపట్టాయి. ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. అడ్మిషన్లు తీసుకున్న కాలేజీలను వెంటనే ఫీజులు వెనక్కి ఇవ్వాలని, లేని పక్షంలో తీవ్రచర్యలు ఉంటాయని హెచ్చరించింది. అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు ఆదేశాలలో పేర్కొంది. 


Also Read: PV Sindhu: ఏపీ సీఎం జగన్ కలిసిన పీవీ సింధు... విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభం


                CJI Comments : న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల రక్షణకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదు : సీజేఐ ఎన్వీ రమణ