Missing Children Found in Tirumala: తిరుమలలో (Tirumala) అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. ముగ్గురు విద్యార్థుల ఆచూకీని కామారెడ్డి రైల్వే స్టేషన్ (Kamareddy Railway Station) లో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరిని స్థానిక ఠాణాకు తరలించిన అక్కడి పోలీసులు ఏపీ పోలీసులు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తిరుమలలో ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం సాయంత్రం అదృశ్యమైన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా, వారు తెలంగాణలో ఉన్నట్లు సమాచారం అందింది.
ఇదీ జరిగింది.
తిరుమలలోని స్థానిక ఆర్బీసీ సెంటర్ లో నివాసం ఉంటున్న స్థానిక ఆర్బీసీ సెంటర్ లో నివాసం ఉంటున్న ఎస్.కృష్ణ కుమారుడు ఎస్.చంద్రశేఖర్ (13), యోగేష్ కుమారుడు వైభవ్ యోగేష్ (13), జి.శ్రీవర్థన్ (13) బుధవారం మధ్యాహ్నం భోజనం సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలలో పరీక్షకు హాజరు కాకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు గాలించినా ఫలితం లేకపోవడంతో తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై సాయినాథ్ చౌదరి విచారణ చేయగా సీసీ కెమెరాల ఆధారంగా వారు తిరుమల నుంచి ల్యాప్ టాప్ తో తిరుపతి చేరుకున్నట్లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేయగా వారు తెలంగాణలో ఉన్నట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు.
Also Read: New Minister Profiles: తెలంగాణ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొత్త మంత్రుల ప్రొఫైల్ చూశారా